విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం..
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు.
శ్రీకాకుళం, సెప్టెంబర్ 27 మేజర్ న్యూస్:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ‘దేశంలో 25 కోట్ల చిన్నారుల కలలు’ అనే అంశంపై శ్రీ సత్యసాయి విద్యా విహార్ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.
కార్యక్రమానికి బీజేపీ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి, సేవా సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్ చింతూ పాపారావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, కో-కన్వీనర్ పాలవలస వైకుంఠరావు, జిల్లా సేవా సంకల్ప అభియాన్ కో-కన్వీనర్, పూర్వ పలాస నియోజకవర్గ కన్వీనర్ రామానంద స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, ప్రజల కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. మోదీ సుదీర్ఘ ప్రజా జీవితంలో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. భారత్‌ను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులతో పాటు మిగిలిన విద్యార్థులకు కన్సొలేషన్ బహుమతులు అందజేశారు.
పోటీలను ఇన్‌చార్జి కంచరాన భుజంగరావు (బుజ్జి) పర్యవేక్షణలో నిర్వహించారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి గుంటు అప్పారావు, టౌన్ ప్రధాన కార్యదర్శులు బొండా శ్రీనివాసరావు, హనుమంతు రామారావు, బీజేవైఎం టౌన్ అధ్యక్షులు పొందర ఈశ్వరరావు, టౌన్ కార్యదర్శి బుదరెడ్డి శ్రీనివాసరావు, సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా పర్యోజన ప్రముఖ్ పెరుమాల రాంబాబు, బి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.