BREAKING
నేటి పంచాంగం: మంగళవారం, 29 సెప్టెంబర్ 2026 తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం మరియు శుభ ముహూర్తాల సమాచారం నారయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్.ఎల్.సి) కార్యక్రమం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ సేవలు మరింత విస్తరణ : మంత్రి సత్యకుమార్ యాదవ్ రోడ్డు పక్కనే టీ-టిఫిన్.. టెంకాయ్ బండి దగ్గర ముచ్చట్లు---*మంత్రి నారాయణ నెల్లూరు, రవితేజ బ్యూరో, మేజర్ న్యూస్: పేదలకు సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయానిధి 85 శాతం రాయితీతో పశుబీమా పశుపోషకులకు అండగా నూతన పశుబీమా పథకం చిత్తూరు జిల్లాలో మళ్లీ ఏనుగుల సంచారం చిన్నారులకు ఎమ్మెల్యే కావ్య ఆశీస్సులు విద్యార్థులతో ఎంపీ వేమిరెడ్డి ముఖాముఖి: ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఏరియా వైద్యశాలలో 'సేవా సంకల్ప అభియాన్': ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య. ఉదయగిరి నియోజకవర్గ వెనుకబాటు ను సీయం కు వివరించండి నేపాల్‌లో జలవిలయం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం ఏఐ దూకుడుకు కళ్లెం వేసే సరికొత్త టూల్‌ను ఆవిష్కరించిన ఎన్విడియా

ముంపు వరి పంటను పరిశీలించిన కలెక్టర్

Select Suryaa Now
ముంపు వరి పంటను పరిశీలించిన కలెక్టర్


నరసన్నపేట, సెప్టెంబర్ 27, మేజర్ న్యూస్:
నరసన్నపేట మండలం మామిడివలస గ్రామంలో ముంపునకు గురైన వరి పంటను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. గత నాలుగు రోజులుగా వరి పంట నీటిలో ఉండటంతో పంటకు కలిగే నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ పంట నష్టాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. డ్రోన్ సహాయంతో ముంపు ప్రాంతాల్లోని పంట పరిస్థితిని పరిశీలించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు అందించే సూచనలు, సలహాలను రైతులు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సూర్యకుమారి, సచివాలయ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.