రోడ్డు ప్రమాదం పై శ్రీమరం పీఠాధిపతులు దిగ్భాంటి
రోడ్డు ప్రమాదంపై శ్రీ సుబుధేంద్రతీర్థులు దిగ్బ్రాంతి
మంత్రాలయం, సూర్య ప్రతినిధి
ఉత్తరాది మఠాధిపతి శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదులు ధార్వాడ్‌లో 31వ చాతుర్మాస్య వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని సవనూర్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్రతీర్థ శ్రీపాదులు తెలిపారు.వెంటనే ఫోన్‌లో శ్రీ సత్యాత్మతీర్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నామని, స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిసి ఊరట కలిగిందన్నారు. ఆదివారం హుబ్బళ్లికి వెళ్లి స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నట్లు తెలిపారు.శ్రీమఠంలో పూజలు, ఆరతి సమయంలో శ్రీ మూలరామదేవుడు, శ్రీ గురు సార్వభౌములను ప్రార్థించి శ్రీ సత్యాత్మతీర్థులు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, మునుపటిలాగే పాఠాలు, ప్రవచనాలు, దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించినట్లు శ్రీ సుబుధేంద్రతీర్థులు పేర్కొన్నారు.