BREAKING
మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకి ఇవ్వాలి తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్ల బుకింగ్‌లో భక్తులకు చేదు అనుభవం : శబరిమల టెండర్ వివరాలు లీక్.. 110 దుకాణాల ఈ-వేలం రద్దు.. త్వరలోనే రీ-టెండర్లు పిలవనున్న దేవస్వం బోర్డు +మేడారం మినీ జాతర తేదీలు ఖరారు.. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు +నాలుగు రోజుల పాటు సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు దేశీయ పర్యాటక రంగానికి సరికొత్త ఊతం.. ‘దేఖో అప్నా దేశ్ 2.0’ ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం చెన్నకేశవ స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి పూజలు ప్రజలతో ఆప్యాయ పలకరింపులు ‎ ‎సామాన్యుడిలా బల్లపై కూర్చొని టీ తాగిన డిప్యూటీ సీఎం ‎ ‎ముదిగొండ టీ స్టాల్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముచ్చట్లు ‎ నేపాల్‌లోని హిమ్‌లుంగ్ బేస్ క్యాంప్‌లో హిమపాతం.. ఇద్దరి మృతదేహాలు వెలికితీత ‎కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లే పార్టీకి మూలస్తంభాలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‎ ‎ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన ‎ ‎రూ. 10 లక్షలకు పెంచిన ఆరోగ్యశ్రీ పరిమితి ‎ ‎ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత అల్పాహారం, పాలు ‎ ‎నవంబర్ 19న ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పథకం ‘ఇందిరమ్మ భీమా’ పూడిమడకలో ఉప్పుటేరును పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మళ్లీ షట్‌డౌన్! ఎస్‌ఐఆర్‌’పై అనుమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు టీ పి సీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రోడ్డు ప్రమాదం పై శ్రీమరం పీఠాధిపతులు దిగ్భాంటి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అలరించిన చి. వేదాంశ కూచిపూడి నృత్య ప్రదర్శన భారత్‌ ఘనవిజయం.. వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం రవీంద్రభారతిలో ఘనంగా 111వ జయంతి వేడుకలు – చేనేత, బీసీ సంక్షేమం, సామాజిక న్యాయంపై దృష్టి

పూడిమడకలో ఉప్పుటేరును పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

Select Suryaa Now
పూడిమడకలో ఉప్పుటేరును పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

 

*మునిగిపోయిన రెండు చైన్ మిషన్లను బయటకు తీసేందుకు చర్యలు - త్వరలో జెట్టీ నిర్మాణం*ఎమ్ ఎల్ ఏ సుందరుపు విజయ్ కుమార్

అచ్యుతాపురం, సెప్టెంబర్ 27: అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటించారు.

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉప్పుటేరులో ఇసుక తవ్వకాల పనులకు వినియోగిస్తున్న రెండు చైన్ మిషన్లు నీటిలో చిక్కుకుని మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఉప్పుటేరు వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నీటిలో మునిగిపోయిన రెండు చైన్ మిషన్లను బయటకు తీసేందుకు జిల్లా కలెక్టర్, రాష్ట్ర హోంమంత్రి, మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి ప్రత్యేక రిస్క్ ఆపరేషన్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిషన్లను సురక్షితంగా బయటకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

పూడిమడకలో జెట్టీ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించి మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామని, జెట్టీ నిర్మాణం పూర్తయ్యే వరకు మత్స్యకారుల బోట్లు రాకపోకలకు తాత్కాలిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఇందుకోసం అధికారులతో మాట్లాడి అంచనాలు తయారు చేయించి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు.

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లేందుకు నడకదారి లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టికి తీసుకువచ్చిన మీదట, సీసీ రోడ్డు లేదా గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి, అలాగే విద్యుత్ లైన్లు ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే హామీతో స్థానిక మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.