BREAKING
మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకి ఇవ్వాలి తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్ల బుకింగ్‌లో భక్తులకు చేదు అనుభవం : శబరిమల టెండర్ వివరాలు లీక్.. 110 దుకాణాల ఈ-వేలం రద్దు.. త్వరలోనే రీ-టెండర్లు పిలవనున్న దేవస్వం బోర్డు +మేడారం మినీ జాతర తేదీలు ఖరారు.. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు +నాలుగు రోజుల పాటు సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు దేశీయ పర్యాటక రంగానికి సరికొత్త ఊతం.. ‘దేఖో అప్నా దేశ్ 2.0’ ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం చెన్నకేశవ స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి పూజలు ప్రజలతో ఆప్యాయ పలకరింపులు ‎ ‎సామాన్యుడిలా బల్లపై కూర్చొని టీ తాగిన డిప్యూటీ సీఎం ‎ ‎ముదిగొండ టీ స్టాల్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముచ్చట్లు ‎ నేపాల్‌లోని హిమ్‌లుంగ్ బేస్ క్యాంప్‌లో హిమపాతం.. ఇద్దరి మృతదేహాలు వెలికితీత ‎కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లే పార్టీకి మూలస్తంభాలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‎ ‎ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన ‎ ‎రూ. 10 లక్షలకు పెంచిన ఆరోగ్యశ్రీ పరిమితి ‎ ‎ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత అల్పాహారం, పాలు ‎ ‎నవంబర్ 19న ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పథకం ‘ఇందిరమ్మ భీమా’ పూడిమడకలో ఉప్పుటేరును పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మళ్లీ షట్‌డౌన్! ఎస్‌ఐఆర్‌’పై అనుమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు టీ పి సీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రోడ్డు ప్రమాదం పై శ్రీమరం పీఠాధిపతులు దిగ్భాంటి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అలరించిన చి. వేదాంశ కూచిపూడి నృత్య ప్రదర్శన భారత్‌ ఘనవిజయం.. వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం రవీంద్రభారతిలో ఘనంగా 111వ జయంతి వేడుకలు – చేనేత, బీసీ సంక్షేమం, సామాజిక న్యాయంపై దృష్టి

చెన్నకేశవ స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి పూజలు ప్రజలతో ఆప్యాయ పలకరింపులు ‎ ‎సామాన్యుడిలా బల్లపై కూర్చొని టీ తాగిన డిప్యూటీ సీఎం ‎ ‎ముదిగొండ టీ స్టాల్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముచ్చట్లు ‎

Select Suryaa Now
చెన్నకేశవ స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి పూజలు ప్రజలతో ఆప్యాయ పలకరింపులు ‎ ‎సామాన్యుడిలా బల్లపై కూర్చొని టీ తాగిన డిప్యూటీ సీఎం ‎ ‎ముదిగొండ టీ స్టాల్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముచ్చట్లు ‎


ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. నిన్న ఆదివారం మధిర నియోజకవర్గ పర్యటనలో భాగంగా వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన హోదాను పక్కనబెట్టి, అత్యంత సాధారణ మానవుడిలా ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజల మధ్యన గడిపారు.
‎ముదిగొండ సెంటర్‌లోని 'నీల్ కమల్ టీ స్టాల్' వద్ద కాన్వాయ్‌ను ఆపిన డిప్యూటీ సీఎం, అక్కడ ఉన్న బల్లపై కూర్చొని ప్రశాంతంగా టీ తాగారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్వయంగా తమ ముందుకు వచ్చి సామాన్యుడిలా టీ తాగుతుండడం చూసి స్థానికులు, ప్రయాణికులు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. ఆయనను చూసేందుకు, మాట్లాడేందుకు జనం పోటీ పడగా, యువత ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ భట్టి విక్రమార్క అందరి మనస్సులను గెలుచుకున్నారు.
‎
‎ప్రజా సంక్షేమంపై ప్రత్యక్ష ఆరా
‎టీ స్టాల్ పరిసరాల్లో ఉన్న మహిళలను ఆప్యాయంగా పలకరించిన డిప్యూటీ సీఎం, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అనంతరం రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారి బానోతు రాంజీ, కూరగాయల వ్యాపారి నరసమ్మలను పలకరించి, ముదిగొండలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులపై అభిప్రాయం అడిగారు. "సార్, మునుపటి కంటే ఇప్పుడు రోడ్డు వెడల్పు కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది" అని నరసమ్మ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, విస్తరణలో ఇండ్లు కోల్పోయామని కొందరు ఆయన దృష్టికి తేగా, "ఎవరూ ఆందోళన చెందవద్దు, ఇండ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున ఇండ్లు ఇస్తాం" అని భరోసా ఇచ్చారు.
‎
‎
‎రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే పల్లె నాగభూషణంను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా పలకరించి కులవృత్తి, కుటుంబ పోషణ గురించి అడిగారు. దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతున్నానని, ఆర్థిక సహకారం అందిస్తే చిన్న డబ్బా ఏర్పాటు చేసుకుంటానని నాగభూషణం కోరగా... ఆయన కుమారుడు పల్లె సురేష్ పేరిట 'రాజీవ్ యువ వికాసం' కింద రూ. లక్ష వరకు రుణ సహాయం అందిస్తామని మాట ఇచ్చారు.


చెన్నకేశవ స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి పూజలు

చింతకాని మండల కేంద్రంలోని  శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని భట్టి విక్రమార్క సందర్శించారు. ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం భట్టి విక్రమార్క ఆలయంలోని గర్భగుడిలో శ్రీ చెన్నకేశవ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం గావించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యతను డిప్యూటీ సీఎంకు వివరించారు.
‎
‎వెంకటాపురం గ్రామానికి చెందిన ఎండ్రోటి యశోద అనే నిరుపేద మహిళ ఇద్దరు ఆడపిల్లలతో అద్దె ఇంట్లో పడుతున్న కష్టాలను వివరించగా, తక్షణమే స్పందించిన డిప్యూటీ సీఎం... రాబోయే 'ఇందిరమ్మ ఇండ్ల' జాబితాలో ఆమెకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేయాలని అక్కడే ఉన్న సర్పంచ్‌ను ఆదేశించారు.
‎
‎అభివృద్ధి పనుల ఆకస్మిక తనిఖీ
‎అనంతరం ముదిగొండలో రూపుదిద్దుకుంటున్న 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, మిగిలిన పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దానితో పాటు పట్టణంలో శరవేగంగా జరుగుతున్న రోడ్డు వెడల్పు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. ఒకే రోజు నియోజకవర్గ అభివృద్ధి పనులను సమీక్షిస్తూనే, మరోవైపు సామాన్య ప్రజల కష్టాలను ఆలకించి అక్కడికక్కడే పరిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీరుపై ముదిగొండ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
‎