హత్యరాల భక్తుల ఆనంద హేళ
హత్యరాల భక్తుల ఆనంద హేళ,,
ఘనంగా గిరి ప్రదక్షణ, గంగా హారతి,,,
భారీగా హాజరైన భక్తులు,,,
గంగా హారతి కార్యక్రమాలు నిర్వహించిన టిడిపి ఇంచార్జ్ జగన్మోహన్ రాజు,,,
రాజంపేట, మేజర్ న్యూస్; హత్యరాల లో శనివారం సాయంత్రం భక్తుల ఆనంద హేల మధ్య గిరి ప్రదక్షణ, గంగా హారతి కార్యక్రమాన్ని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు చేతుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజంపేట నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రమైన హత్యరాల మహా క్షేత్రంలో శనివారం సాయంత్రం హర హర మహాదేవ అనే భక్తుల నినాదాలతో హత్యరాల పుణ్యక్షేత్రం మారుమోగింది. హత్యరాల దేవస్థానం కార్యవర్గ కమిటీ ఆధ్వర్యంలో టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు సారథ్యంలో గిరి ప్రదక్షిణ, గంగా హారతి కార్యక్రమాన్ని భారీగా హాజరైన భక్తులు మధ్య అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ ఎంతో చరిత్ర మరియు మహిమగల హత్యరాల త్రేతేశ్వర స్వామి ఆలయంలో గంగా హారతి గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రముఖ పుణ్యక్షేత్రంగా హత్యరాలకు అన్ని రంగులను ఏర్పాటు చేసి ఆ హరహర మహాదేవుడు ఇచ్చిన అవకాశాన్ని తాను ఈ మహా పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి పరిచి సద్వినియోగపరచుకుంటానని, రాజంపేట ప్రజలకే కాకుండా చుట్టుపక్క ప్రాంతాల ప్రజలకు కూడా హత్య రాల పుణ్యక్షేత్రం మహా క్షేత్రంగా దర్శనమిచ్చే రోజులు అది దగ్గరలోనే ఉన్నాయని, అందుకే హత్యరాల అభివృద్ధికి కట్టుబడి ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. అందరి సహకారంతో ఇకపై గిరి ప్రదక్షణ, హారతి కార్యక్రమాలను అన్ని పుణ్యక్షేత్రాలకు దీటుగా హత్యరాలలో నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.