కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఘన స్వాగతం
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
కడప జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కడపలో నూతనంగా నిర్మిస్తున్న విమానాశ్రయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో జరుగుతున్న నిర్మాణ పనులను కేంద్ర మంత్రి పరిశీలించి, అధికారులను పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విమానాశ్రయ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.