BREAKING
హైదరాబాద్ జీపీఓ స్థాయిని తగ్గించొద్దు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానికి ఒవైసీ లేఖ బ్రెజిల్‌లో పెరిగిన జీవన వ్యయం.. అధ్యక్షుడు లూలా గెలుపు అవకాశాలకు దెబ్బ! గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో భారీ పేలుడు కమలాపురం రైలు నిలుపుదలపై కేంద్ర మంత్రికి వినతి.. రైళ్ల పునరుద్ధరణకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ సీఎం రమేష్ నాయుడు - హామీ పేదలకు పట్టాభిషేకంలో మరో చారిత్రక ఘట్టం.. ఈ నెల 30న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన ఏపీ పీసీబీ ఐలమ్మకు నివాళి.. రావుల స్వామికి సన్మానం దేశం గర్వించదగిన జాతిరత్నం మన్మోహన్‌ సింగ్‌: సీఎం రేవంత్‌రెడ్డి హత్యరాల భక్తుల ఆనంద హేళ రోజూ అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదేనా?.. నిపుణులు ఏం చెబుతున్నారు? రైతుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం 1,101 మంది నూతన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన ఒడిశా సీఎం.. అవినీతికి దూరంగా ఉండాలని మోహన్ మాఝీ హితవు జెన్-జీ ఓటు హక్కును కాలరాసి ఇప్పుడు క్యాంపుల డ్రామా.. ఈసీ తప్పుడు విధానాలపై కాంగ్రెస్ నిప్పులు ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం అడ్వైజరీ కమిటీ క్షేత్రబాట ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తింటున్నారా?.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన ఆరోగ్య రహస్యాలు ఇవే

ప్రొద్దుటూరు అభివృద్ధికి కేంద్ర మంత్రులకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వినతి

Select Suryaa Now
ప్రొద్దుటూరు అభివృద్ధికి కేంద్ర మంత్రులకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వినతి

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పలు కీలక మౌలిక వసతుల పనులను చేపట్టాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కేంద్ర మంత్రులను కోరారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కలిసి, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అత్యంత అవసరమైన దువ్వూరు రోడ్డును 4-లేన్ల రహదారిగా అభివృద్ధి చేయడంతో పాటు, ప్రొద్దుటూరుకు కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని మిస్సింగ్ హైవే లింక్ రోడ్లను జాతీయ రహదారుల పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఈ అంశంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి సంబంధిత పనులను త్వరితగతిన పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరినట్లు తెలిపారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అవసరమైన కీలక రహదారి, విద్యా మౌలిక వసతుల పనులను కేంద్ర స్థాయిలో సమన్వయం చేసి త్వరగా అమలు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు తదితరులు ఉన్నారు.