BREAKING
హైదరాబాద్ జీపీఓ స్థాయిని తగ్గించొద్దు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానికి ఒవైసీ లేఖ బ్రెజిల్‌లో పెరిగిన జీవన వ్యయం.. అధ్యక్షుడు లూలా గెలుపు అవకాశాలకు దెబ్బ! గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో భారీ పేలుడు కమలాపురం రైలు నిలుపుదలపై కేంద్ర మంత్రికి వినతి.. రైళ్ల పునరుద్ధరణకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ సీఎం రమేష్ నాయుడు - హామీ పేదలకు పట్టాభిషేకంలో మరో చారిత్రక ఘట్టం.. ఈ నెల 30న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన ఏపీ పీసీబీ ఐలమ్మకు నివాళి.. రావుల స్వామికి సన్మానం దేశం గర్వించదగిన జాతిరత్నం మన్మోహన్‌ సింగ్‌: సీఎం రేవంత్‌రెడ్డి హత్యరాల భక్తుల ఆనంద హేళ రోజూ అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదేనా?.. నిపుణులు ఏం చెబుతున్నారు? రైతుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం 1,101 మంది నూతన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన ఒడిశా సీఎం.. అవినీతికి దూరంగా ఉండాలని మోహన్ మాఝీ హితవు జెన్-జీ ఓటు హక్కును కాలరాసి ఇప్పుడు క్యాంపుల డ్రామా.. ఈసీ తప్పుడు విధానాలపై కాంగ్రెస్ నిప్పులు ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం అడ్వైజరీ కమిటీ క్షేత్రబాట ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తింటున్నారా?.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన ఆరోగ్య రహస్యాలు ఇవే

ప్రొద్దుటూరులో 45 రోజుల ఎగ్జిబిషన్‌కు 28న టెండర్‌-కం-బహిరంగ వేలం

Select Suryaa Now
ప్రొద్దుటూరులో 45 రోజుల ఎగ్జిబిషన్‌కు    28న టెండర్‌-కం-బహిరంగ వేలం

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ :

ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన అనిబిసెంట్ మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో 2026 సంవత్సరానికి దసరా నవరాత్రుల సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు మునిసిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. దసరా నవరాత్రులు ప్రారంభమైన తేదీ నుంచి 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు గుత్త హక్కును బహిరంగ వేలం ద్వారా కేటాయించనున్నట్లు మునిసిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 28, 2026 సోమవారం ఉదయం 11 గంటలకు ప్రొద్దుటూరు మునిసిపల్ కార్యాలయంలో టెండర్-కం-బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు ఆసక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలు నిర్ణీత సమయంలో వేలం ప్రక్రియకు హాజరై పాల్గొనవచ్చని అధికారులు సూచించారు. వేలంలో పాల్గొనే వారు రూ.25,00,000/- (ఇరవై ఐదు లక్షల రూపాయలు) దారావత్తు సమర్పించాల్సి ఉంటుందని, అదేవిధంగా బ్యాంకు గ్యారంటీ తప్పనిసరిగా ఉండాలని ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. టెండర్ మరియు బహిరంగ వేలానికి సంబంధించిన నిబంధనలు, షరతులను పాటిస్తూ అర్హత కలిగిన వారు మాత్రమే పాల్గొనాలని మునిసిపల్ అధికారులు తెలిపారు. దసరా నవరాత్రుల సందర్భంగా నిర్వహించనున్న ఈ 45 రోజుల ఎగ్జిబిషన్‌లో ప్రజలకు వినోదం, వివిధ రకాల స్టాళ్లు, వస్తువుల విక్రయాలు తదితర సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిబిషన్ నిర్వహణలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మునిసిపల్ నిబంధనలు, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

టెండర్-కం-బహిరంగ వేలం తేదీ: 28-09-2026, సోమవారం సమయం: ఉదయం 11.00 గంటలకు వేదిక: ప్రొద్దుటూరు మునిసిపల్ కార్యాలయం

 దారావత్తు: రూ.25,00,000/- బ్యాంకు గ్యారంటీ: తప్పనిసరి ఎగ్జిబిషన్ వ్యవధి: 45 రోజులు