BREAKING
ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు ముమ్మరం ఇతర రాష్ట్రాల ఆజ్ఞలను పాటిస్తున్నారు విద్యుత్ రంగాన్ని రేవంత్ ప్రభుత్వం నాశనం చేసింది వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ డైవర్షన్ డ్రామాలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లో సంచారి సినిమా విడుదల హక్కులను దక్కించుకున్న గాయత్రి ఫిలిమ్స్ మాదాపూర్‌, గచ్చిబౌలిలో 11 హోటళ్ల లైసెన్సులు రద్దు దౌల్తాబాద్‌లో విషాదం:షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం, రూ.20 లక్షలు, బంగారం బూడిద హైదరాబాద్ జీపీఓ స్థాయిని తగ్గించొద్దు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానికి ఒవైసీ లేఖ బ్రెజిల్‌లో పెరిగిన జీవన వ్యయం.. అధ్యక్షుడు లూలా గెలుపు అవకాశాలకు దెబ్బ! గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో భారీ పేలుడు కమలాపురం రైలు నిలుపుదలపై కేంద్ర మంత్రికి వినతి.. రైళ్ల పునరుద్ధరణకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ సీఎం రమేష్ నాయుడు - హామీ పేదలకు పట్టాభిషేకంలో మరో చారిత్రక ఘట్టం.. ఈ నెల 30న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన ఏపీ పీసీబీ ఐలమ్మకు నివాళి.. రావుల స్వామికి సన్మానం దేశం గర్వించదగిన జాతిరత్నం మన్మోహన్‌ సింగ్‌: సీఎం రేవంత్‌రెడ్డి హత్యరాల భక్తుల ఆనంద హేళ రోజూ అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదేనా?.. నిపుణులు ఏం చెబుతున్నారు?

దేశం గర్వించదగిన జాతిరత్నం మన్మోహన్‌ సింగ్‌: సీఎం రేవంత్‌రెడ్డి

Select Suryaa Now
దేశం గర్వించదగిన జాతిరత్నం మన్మోహన్‌ సింగ్‌: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, సూర్య ప్రతినిధి : దివంగత మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ దేశ ఆర్థిక వ్యవస్థకు అందించిన సేవలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. దేశం గర్వించదగిన జాతిరత్నంగా మన్మోహన్‌ సింగ్‌ నిలిచారని పేర్కొన్నారు.

మన్మోహన్‌ సింగ్‌ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఎంతో కీలకమైనవని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆర్థిక రంగంలో సరళీకృత విధానాలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ చూపించారని తెలిపారు. అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు నేతృత్వంలో మన్మోహన్‌ సింగ్‌ తీసుకున్న ఆర్థిక విధానాలు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో కీలకపాత్ర పోషించాయని చెప్పారు.

పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ అమలు చేసిన ఆర్థిక విధానాల ప్రభావంతోనే భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ బిల్లుపై సంతకం చారిత్రాత్మకం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మన్మోహన్‌ సింగ్‌ పోషించిన పాత్రను కూడా సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై మన్మోహన్‌ సింగ్‌ చేసిన సంతకం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అన్నారు.

తెలంగాణ బిల్లుపై మన్మోహన్‌ సింగ్‌ చేసిన సంతకాన్నే ఇక్కడ నిక్షిప్తం చేశామని రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో ఆ సంతకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు.