BREAKING
యాపిల్ సంస్థకు భారీ షాక్.. ట్రంప్-జిన్‌పింగ్ భేటీలో కీలక ఒప్పందం.. అమెరికా బొగ్గు కొనుగోళ్లకు చైనా హామీ, కొనసాగుతున్న సుంకాల చర్చలు ఆసియా క్రీడలు 2026 డే 8 షెడ్యూల్.. రేపు బరిలోకి దిగనున్న భారత అథ్లెట్లు, పతక పోరు వివరాలు ఆమె క‌విత్వం ఆత్మ విశ్వాసానికి ప్ర‌తీక‌.. 4(A) నేవల్ మెడికల్ యూనిట్ NCC వార్షిక తనిఖీ – ‘శిక్షణ’ బహుళ ప్రయోజన శిక్షణా మందిరం ప్రారంభం వాహనాల అతివేగానికి కళ్లెం...? శిథిలావస్థలో మద్ది బ్రిడ్జి..! భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మహా దారుణం..! అవంతిలో ఘనంగా ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవ వేడుకలు ఒరాకిల్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.8,200 కోట్ల విలువైన స్టాక్ ఆప్షన్లు.. షేర్ల పతనంతో చిక్కుల్లో పడ్డ నాయకత్వం ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు ముమ్మరం ఇతర రాష్ట్రాల ఆజ్ఞలను పాటిస్తున్నారు విద్యుత్ రంగాన్ని రేవంత్ ప్రభుత్వం నాశనం చేసింది వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ డైవర్షన్ డ్రామాలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లో సంచారి సినిమా విడుదల హక్కులను దక్కించుకున్న గాయత్రి ఫిలిమ్స్ మాదాపూర్‌, గచ్చిబౌలిలో 11 హోటళ్ల లైసెన్సులు రద్దు దౌల్తాబాద్‌లో విషాదం:షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం, రూ.20 లక్షలు, బంగారం బూడిద

ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు ముమ్మరం

Select Suryaa Now
ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు ముమ్మరం

ముఖ్య నేతలతో చింతల రామచంద్రారెడ్డి లంచ్‌ మీట్‌.. హాజరైన కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ సూర్య ప్రతినిధి : ఖైరతాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ కసరత్తును ముమ్మరం చేసింది. పార్టీ ముఖ్య నేతలతో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి లంచ్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ నేత కిషన్‌రెడ్డి హాజరయ్యారు.

ఉపఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, నేతల సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై నేతలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, రేపు సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ముఖ్య నేతలతో కిషన్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఖైరతాబాద్‌ ఉపఎన్నికకు సంబంధించి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకునే దిశగా ఈ భేటీ జరగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.