BREAKING
యాపిల్ సంస్థకు భారీ షాక్.. ట్రంప్-జిన్‌పింగ్ భేటీలో కీలక ఒప్పందం.. అమెరికా బొగ్గు కొనుగోళ్లకు చైనా హామీ, కొనసాగుతున్న సుంకాల చర్చలు ఆసియా క్రీడలు 2026 డే 8 షెడ్యూల్.. రేపు బరిలోకి దిగనున్న భారత అథ్లెట్లు, పతక పోరు వివరాలు ఆమె క‌విత్వం ఆత్మ విశ్వాసానికి ప్ర‌తీక‌.. 4(A) నేవల్ మెడికల్ యూనిట్ NCC వార్షిక తనిఖీ – ‘శిక్షణ’ బహుళ ప్రయోజన శిక్షణా మందిరం ప్రారంభం వాహనాల అతివేగానికి కళ్లెం...? శిథిలావస్థలో మద్ది బ్రిడ్జి..! భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మహా దారుణం..! అవంతిలో ఘనంగా ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవ వేడుకలు ఒరాకిల్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.8,200 కోట్ల విలువైన స్టాక్ ఆప్షన్లు.. షేర్ల పతనంతో చిక్కుల్లో పడ్డ నాయకత్వం ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు ముమ్మరం ఇతర రాష్ట్రాల ఆజ్ఞలను పాటిస్తున్నారు విద్యుత్ రంగాన్ని రేవంత్ ప్రభుత్వం నాశనం చేసింది వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ డైవర్షన్ డ్రామాలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లో సంచారి సినిమా విడుదల హక్కులను దక్కించుకున్న గాయత్రి ఫిలిమ్స్ మాదాపూర్‌, గచ్చిబౌలిలో 11 హోటళ్ల లైసెన్సులు రద్దు దౌల్తాబాద్‌లో విషాదం:షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం, రూ.20 లక్షలు, బంగారం బూడిద

ఆమె క‌విత్వం ఆత్మ విశ్వాసానికి ప్ర‌తీక‌..

Select Suryaa Now
ఆమె క‌విత్వం ఆత్మ విశ్వాసానికి ప్ర‌తీక‌..


గుత్తి రాజ్య‌ల‌క్ష్మి క‌వితా సంపుటి 'జీవ‌న త‌రంగాలు'.

ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో సాహితీ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌..

 

సీతమ్మధార సెప్టెంబ‌రు 26 మేజర్ న్యూస్ ;
క‌విత్వం మాన‌వీయ విలువ‌ల‌కు అద్దం ప‌డుతుంద‌ని ప్ర‌ముఖ ప‌త్రికా ర‌చ‌యిత‌,నాట‌క ర‌చ‌యిత‌, సాంస్కృతిక విశ్లేష‌కుడు చైత‌న్య స‌మితి నిర్వాహ‌కుడు భీశెట్టి వెంక‌ట అప్పారావు(బీవీ) అన్నారు. న‌గ‌రంలోని తాడివీధిలో పుట్టిపెరిగిన 76 ఏళ్ల గ‌త కొన్ని ద‌శాబ్ధాలుగా మ‌న‌సు పొర‌ల్లో గూడుక‌ట్టుకున్న భావాల‌కు, ఊహ‌ల రెక్క‌లు తొడిగి  'జీవ‌న త‌రంగాలు ' పేరిట క‌వితా ఓ సంక‌ల‌నం వెలుగులోకి తెచ్చారు. శనివారం ఉద‌యం పౌర గ్రంధాల‌యంలో క‌వి,ర‌చ‌యిత 'ప్ర‌జ్ఞ‌శ్రీస డాక్ట‌ర్ బండి స‌త్య‌నారాయ‌ణ చేతుల మీదుగా జీవ‌న‌త‌రంగాలు పుస్త‌కావిష్క‌ర‌ణ జ‌రిగింది. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన బీవీ అప్పారావు మాట్లాడుతూ విశాఖ‌ప‌ట్నంలోని కేజీహెచ్ ద‌గ్గ‌ర్లో ఉన్న తాడివీధి ఎంద‌రో మ‌హ‌నీయుల క‌న్న త‌ల్లి అన్నారు. అటువంటి గ‌డ్డ మీద పుట్టిన గుత్తి రాజ్య‌ల‌క్ష్మి వెలువ‌రించిన క‌విత్వంలో గ‌త ఏడున్నర ద‌శాబ్ధాలుగా జీవ‌న పోరాటంలో ఆమె ఎదుర్కొన్న అనుభ‌వాలు, చ‌విచూసిన సంఘ‌ట‌న‌ల ఆధారంగానే అక్ష‌ర సేద్యం చేయ‌డం గ‌మ‌నార్హం అన్నారు. ఇప్ప‌టి త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు మొబైల్ కొన‌క‌పోతే కుద‌ర‌దు. కాస్సేపు దాన్ని వాడొద్దు బుద్ధిగా చ‌దువుకో అంటేనే మాన‌సిక కుంగుబాటుకు గుర‌య్యే దుర్భ‌ర‌మైన సామాజిక రోగం విప‌రీతంగా ఉంద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఆధునిక మ‌హ‌మ్మారిలా దాపురించిన క్యాన్స‌ర్‌ను జ‌యించి ఆమె నిల‌దొక్కుకున్నారంటే ఆమె ఆత్మ‌స్థ‌యిర్యాన్నిగురించి వేరే ఉదాహ‌ర‌ణ‌లు అక్క‌ర‌లేద‌న్నారు. తాన తండ్రి మ‌ర‌ణించిన మ‌రుస‌టి రోజే ఎస్ఎస్ఎల్‌సీ తొలి ప‌రీక్ష‌కు హాజ‌రైన మ‌నో నిబ్బ‌రం ఆమెది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గురి త‌ప్ప‌కుండా ల‌క్ష్యం వైపు మ‌నిషి ప్ర‌యాణం సాగాల‌నే మొక్క‌వోని దీక్ష ఆమెకు తొలియ‌వ్వ‌నంలోనే అద్భుత‌మైన జీవిత పాఠాలు నేర్పించింద‌న్నారు. పుస్త‌క ఆవిష్క‌ర్త డాక్ట‌ర్ బండి స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ  సాధించాల‌న్న సంక‌ల్ప బ‌లం మ‌న‌లో ఉంటే ల‌క్ష్యం వైపు అడుగులు వేయ‌డానికి ఏదీ అడ్డంకి కాద‌ని రాజ్య‌ల‌క్ష్మి త‌న జీవితం ద్వారా నిరూపించి యువ‌త‌కు,భావిత‌రాల‌కు ఆద‌ర్శంగా నిలిచార‌న్నారు. ఆమె ఆత్మ‌బ‌లం ముందు క్యాన్స‌ర్ ఓడిపోయింది. ఇంకా చెప్పాలంటే హ‌డ‌లెత్తి పోయింద‌న్నారు.  సుమారు గ‌త 55 సంవ‌త్ప‌రాల నుంచి ఆమె ర‌చించిన క‌విత‌ల నుంచి మేలైన‌వి ఎంపిక చేసి 131 క‌విత‌ల‌తో వెలువ‌రించిన ఈ జీవ‌న‌త‌రంగాలు సంక‌ల‌నం పేజీల‌లో క‌విత్వం ఎంత చిక్క‌గా ఉంటుందో మాన‌వ సంబంధాల‌కు ఆమె ఇచ్చేప్రాధాన్య‌త కూడా అలాగేఉంటుద‌న్నారు. భీమ్ సేన (వార్‌)  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ వ‌సంత రాజేంద్ర ప్ర‌సాద్ అధ్య‌క్ష‌త వ‌హించారు. నేవ‌ల్ డాక్‌యార్డు ఫ్యాబ్రికేష‌న్ డిపార్టుమెంటుకు చెందిన జేటీఓపైలా శ్రీ‌నివాస రావుకు ఈ పుస్త‌కాన్ని అంకిత‌మిచ్చారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి బి. రాధా రాణి క‌విత్వంపై  స‌మీక్షించారు. డీఐటీయూ రాష్ట్ర అధ్య‌క్షుడు స్వాగ‌తోప‌న్యాసం చేశారు. ప్ర‌ముఖ క‌వి, క‌థ‌కుడు, విమ‌ర్శ‌కుడు, ప‌త్రికా ర‌చ‌యిత బందిలి ర‌త‌న్ రాజు మాట్లాడుతూ నేటి స‌మాజంలో క‌విత్వం, క‌థ‌, వ్యాసం ఇతివృత్తం ఏదైనా సాహితీ ప్ర‌క్రియల‌న్నింటికీ క‌లుపుమొక్క‌ల‌ను ఏరిపారేసే గురుత‌ర బాధ్య‌త సాహితీవేత్త‌ల భుజ‌స్కంధాల‌పై ఉంద‌న్నారు. ర‌చ‌యిత్రి గుత్తి రాజ్య‌ల‌క్ష్మి త‌న స్పంద‌న‌లో త‌న క‌లం నుంచి జాలువారిన అక్ష‌రాలు క‌వితా సంక‌ల‌నంగా రూపొంద‌డానికి ద‌శాబ్ధకాలం ప‌ట్టింద‌న్నారు. ఈ ప్ర‌క్రియ‌కు వివిధ ద‌శ‌ల్లో స‌హ‌కార‌మందించిన ప‌లువురికి పేరు పేరునా ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఆలిండియా రేడియోలో క‌విత‌లు చ‌దివి ఎన్నో క‌విత‌లు రాసిన త‌న త‌ల్లి ఆలోచ‌న‌ల్లో మొగ్గ‌తొడిగిన ర‌చ‌నా బీజాలు పుస్త‌కంగా వెలువ‌రించాల‌న్న త‌న క‌ల‌ను సాకారం చేసిన ప్ర‌తిఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పుస్త‌క ప్ర‌చుర‌ణ‌లో స‌హ‌క‌రించివారంద‌రికీ ఈవేదిక‌పై స‌న్మానాలు జ‌రిగాయి. విశేష సంఖ్య‌లో హాజ‌రైన సాహితీ ప్రియులు, కుటుంబ‌స‌భ్య‌ల‌తో హాలు నిండిపోయింది.