మాదాపూర్, గచ్చిబౌలిలో 11 హోటళ్ల లైసెన్సులు రద్దు
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన 11 హోటళ్లు, రెస్టారెంట్ల లైసెన్సులను ఫుడ్ సేఫ్టీ అధికారులు రద్దు చేశారు. తనిఖీల్లో కుళ్లిన, గడువు ముగిసిన ఆహార పదార్థాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
లైసెన్సులు రద్దైన వాటిలో మొనాస్ట్రీ, కోల్ స్పార్క్, కాంచి కేఫ్, అల్‌సబా, శివాని బార్ అండ్ రెస్టారెంట్, లక్కీ, ఉడిపిస్ ఉపహార్, అంతెరా కిచెన్ అండ్ బార్, సాయిరాం మెస్, అమ్ ఆహా తెలుగు కిచెన్, ఫ్యూజన్ 9, అమ్నీషియా స్కైబార్ ఉన్నాయి.
తనిఖీల సందర్భంగా ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, గడువు తేదీలు, పరిశుభ్రత తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆహార పదార్థాలు గుర్తించడంతో సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకున్నట్లు ఫుడ్ సేఫ్టీ విభాగం వెల్లడించింది.
నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రత ప్రమాణాలపై తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.