BREAKING
యాపిల్ సంస్థకు భారీ షాక్.. ట్రంప్-జిన్‌పింగ్ భేటీలో కీలక ఒప్పందం.. అమెరికా బొగ్గు కొనుగోళ్లకు చైనా హామీ, కొనసాగుతున్న సుంకాల చర్చలు ఆసియా క్రీడలు 2026 డే 8 షెడ్యూల్.. రేపు బరిలోకి దిగనున్న భారత అథ్లెట్లు, పతక పోరు వివరాలు ఆమె క‌విత్వం ఆత్మ విశ్వాసానికి ప్ర‌తీక‌.. 4(A) నేవల్ మెడికల్ యూనిట్ NCC వార్షిక తనిఖీ – ‘శిక్షణ’ బహుళ ప్రయోజన శిక్షణా మందిరం ప్రారంభం వాహనాల అతివేగానికి కళ్లెం...? శిథిలావస్థలో మద్ది బ్రిడ్జి..! భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మహా దారుణం..! అవంతిలో ఘనంగా ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవ వేడుకలు ఒరాకిల్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.8,200 కోట్ల విలువైన స్టాక్ ఆప్షన్లు.. షేర్ల పతనంతో చిక్కుల్లో పడ్డ నాయకత్వం ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు ముమ్మరం ఇతర రాష్ట్రాల ఆజ్ఞలను పాటిస్తున్నారు విద్యుత్ రంగాన్ని రేవంత్ ప్రభుత్వం నాశనం చేసింది వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ డైవర్షన్ డ్రామాలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లో సంచారి సినిమా విడుదల హక్కులను దక్కించుకున్న గాయత్రి ఫిలిమ్స్ మాదాపూర్‌, గచ్చిబౌలిలో 11 హోటళ్ల లైసెన్సులు రద్దు దౌల్తాబాద్‌లో విషాదం:షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం, రూ.20 లక్షలు, బంగారం బూడిద

వాహనాల అతివేగానికి కళ్లెం...?

Select Suryaa Now
వాహనాల అతివేగానికి కళ్లెం...?


--- లేజర్ గన్ లతో పరిశీలన 
--- రూల్స్ అతిక్రమిస్తే తాట తీస్తాం 
--- పోలీసుల హెచ్చరిక...!

ఆనందపురం:26సెప్టెంబర్ మేజర్ న్యూస్.

రహదారి భద్రతకు విఘాతం కలిగించే అతివేగం, హెల్మెట్‌ లేకుండా ప్రయాణం, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌ వినియోగం, ట్రిపుల్‌ రైడింగ్‌ వంటి నిబంధనల ఉల్లంఘనలపై ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝళిపించారు. విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి ఆదేశాలు, అదనపు డీసీపీ (ట్రాఫిక్‌), ఏసీపీ (ట్రాఫిక్‌) సూచనల మేరకు భీమిలి క్రాస్‌రోడ్డు నుంచి ఆనందపురం వైపు వచ్చే ప్రధాన రహదారిపై శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
నార్త్‌ ట్రాఫిక్‌ సీఐ సీహెచ్‌. ఉమాకాంత్‌, ఆనందపురం ట్రాఫిక్‌ ఎస్‌ఐ పి. పాపారావు సిబ్బందితో కలిసి ఈ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. సిపి బాగ్చి సమకూర్చిన అత్యాధునిక స్పీడ్‌ లేజర్‌ గన్‌ను వినియోగిస్తూ రహదారిపై వాహనాల వేగాన్ని పరిశీలించారు. పరిమితికి మించి వేగంతో ప్రయాణిస్తున్న వాహనాలను సాంకేతిక పరికరం ద్వారా గుర్తించి, నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారు.
అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించారా? వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌ వినియోగిస్తున్నారా? ఒకే ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తున్నారా? తదితర అంశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 100 మంది వాహనదారులను గుర్తించి, వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించారు.
వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. అతివేగం కారణంగా ప్రమాదాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున వాహనాలను నిర్దేశిత వేగ పరిమితిలోనే నడపాలని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్‌ ధరించాలని, వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్‌ వినియోగించరాదని సూచించారు. ఒకే వాహనంపై పరిమితికి మించి ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు.
రహదారులపై ప్రమాదాలను నియంత్రించడంతోపాటు వాహనదారుల్లో నిబంధనలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భవిష్యత్తులోనూ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.