BREAKING
యాపిల్ సంస్థకు భారీ షాక్.. ట్రంప్-జిన్‌పింగ్ భేటీలో కీలక ఒప్పందం.. అమెరికా బొగ్గు కొనుగోళ్లకు చైనా హామీ, కొనసాగుతున్న సుంకాల చర్చలు ఆసియా క్రీడలు 2026 డే 8 షెడ్యూల్.. రేపు బరిలోకి దిగనున్న భారత అథ్లెట్లు, పతక పోరు వివరాలు ఆమె క‌విత్వం ఆత్మ విశ్వాసానికి ప్ర‌తీక‌.. 4(A) నేవల్ మెడికల్ యూనిట్ NCC వార్షిక తనిఖీ – ‘శిక్షణ’ బహుళ ప్రయోజన శిక్షణా మందిరం ప్రారంభం వాహనాల అతివేగానికి కళ్లెం...? శిథిలావస్థలో మద్ది బ్రిడ్జి..! భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మహా దారుణం..! అవంతిలో ఘనంగా ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవ వేడుకలు ఒరాకిల్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.8,200 కోట్ల విలువైన స్టాక్ ఆప్షన్లు.. షేర్ల పతనంతో చిక్కుల్లో పడ్డ నాయకత్వం ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు ముమ్మరం ఇతర రాష్ట్రాల ఆజ్ఞలను పాటిస్తున్నారు విద్యుత్ రంగాన్ని రేవంత్ ప్రభుత్వం నాశనం చేసింది వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ డైవర్షన్ డ్రామాలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లో సంచారి సినిమా విడుదల హక్కులను దక్కించుకున్న గాయత్రి ఫిలిమ్స్ మాదాపూర్‌, గచ్చిబౌలిలో 11 హోటళ్ల లైసెన్సులు రద్దు దౌల్తాబాద్‌లో విషాదం:షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం, రూ.20 లక్షలు, బంగారం బూడిద

భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మహా దారుణం..!

Select Suryaa Now
భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మహా దారుణం..!

భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మహా దారుణం..!!

యువకుడి బందువులు పై యువతి బంధువులు దాడి..!!

గొడవను చరవాణి లో చిత్రీకరిస్తున్న ఎస్బి హేడ్ కానిస్టేబుల్ పై దాడి..!!

దాడి చేసిన వారిపై కేసు నమోదు రిమాండ్ కు తరలింపు..!!

భీమిలి, సెప్టెంబర్ 26, మేజర్ న్యూస్:

ప్రేమ వివాహం వ్యవహారంలో ఒక యువకుడు బంధువుల పై దాడి చేసిన ఘటనలో యువతి బంధువులు పై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి రిమాండ్ కు తరలించినట్లు భీమిలి పోలీస్ స్టేషన్ సి ఐ దివాకర్ యాదవ్ తెలిపారు. స్థానిక విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ మేజర్స్ అయిన తగరపువలస, బంగ్లామెట్ట కు చెందిన యువతిని మజ్జిపేటకు చెందిన గంగరాజు ప్రేమించి మూడు రోజుల క్రింద వివాహం చేసుకున్నట్లు చెప్పారు. కాగా యువతి బంధువులు యువతి అదృశ్యం అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం తెలిసి యువతీయువకులను పోలీస్ స్టేషన్ కు రప్పించి వివరాలు తెలుసుకుని ఇద్దరు మేజర్స్ అనీ పంపివేసినట్లు చెప్పారు. యువకుడు బంధువులు రెండు ఆటోలలో తమ గ్రామానికి బయలుదేరి వెలుతుండ గా దారిలో యువతి బంధువులు మరియు వారితో వచ్చిన  వీరిపై కర్రలు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసారు. దాడి చేసిన వారిలో తగరపువలస కు చెందిన  ఇంటి సతీష్,ఇంటి సునీత,ఇంటి నర్సింగ్ రావు,ఇంటి వెంకటరమణ లు లావేటి వెంకటేశ్వర్రావు లు ఆనందపురం మండలం (గండి గుండం) మామిడిలోవ గ్రామానికి చెందిన నిమ్మకాయల రవితేజ,నిమ్మ కాయల అనిత,భీమిలి రెల్లి వీదికి చెందిన కుప్పిలి అప్పారావు,పద్మనాభం మండలం రేవిడి పంచాయితీ (రౌతుల పాలెం) కి చెందిన మీసాల రమణలు  అయితే అక్కడ విధులునిర్వహిస్తున్న స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ వచ్చి ఫోటోలను తీస్తుండగా ఆయనపై కూడా దాడి చేసి గాయపరచినట్లు తెలిపారు. వీరిపై అటెంప్ట్ మర్డర్ కేసు కట్టి రిమాండ్ కు పంపినట్లు సిఐ దివాకర్ యాదవ్ చెప్పారు. క్షణికావేశంలో చేసిన చిన్న తప్పు అయినా పెద్ద శిక్ష పడుతుందని చెప్పారు. దయచేసి ఎవరూ తప్పులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు.