అవంతిలో ఘనంగా ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవ వేడుకలు
అవంతిలో ఘనంగా ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవ వేడుకలు
భీమిలి, సెప్టెంబర్ 26,మేజర్ న్యూస్:
అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవమును స్వస్త్ భారత్ కంబాటింగ్ ఏంటిమైక్రోబియల్ రెసిస్టన్స్ అనే నినాదముతో అవంతి కళాశాలల చైర్మన్, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కార్యక్రమానికి విచ్చేసిన అతిధులతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించినారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రస్తుత సమాజములో ఫార్మాసిస్ట్ లు చాలా అవసరము. ఫార్మసీ రంగములో విస్తృత ఉద్యోగ అవకాశములు కలవు, కరోనా వంటి అంటువ్యాధులు నిర్ములించడములో ఫార్మాసిస్టులు ప్రధాన పాత్ర పోసించారని తెలిపారు. మీరు కూడా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆకాక్షించారు. గౌరవ అతిధిగా డా జి. గిరిజ శంకర్, ప్రిన్సిపాల్ అండ్ ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులు ఫార్మసీ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సమాజానికి సేవలందించాలని సూచించారు. ప్రతి ఫార్మాసిస్ట్కి క్లినికల్ మరియు ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. రోగి యొక్క ఆరోగ్య సమస్యలపై దృష్టిలో పెట్టుకొని సరైన చికిత్సను, మందులను అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థి కూడా సంపూర్ణ ఆరోగ్యము మీద దృష్టి పెట్టాలాని, అలాగే మారుతున్న సమాజానికి అనుగుణంగా డ్రగ్స్ మీద పరిశోధన జరపాలని తెలిపారు. విశిష్ఠ అతిధిగా డా. ఎస్.వి.ఎన్. సురేష్ బాబు, సీఈఓ,బొటానిక్స్ ఇండస్ట్రీస్ భోగాపురం, విజయనగరం మాట్లాడుతూ ఫార్మసీ రంగం ప్రాధాన్యత, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర, ఔషధాల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి పుస్తక నాలెడ్జ్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం. ఫార్మా రంగములో చాలా ఎక్కువ ఉద్యోగావకాశములు వున్నాయి. మీరు కష్టపడి చదివి లక్ష్యాలను సాధించాలని కోరారు. ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాలైన పోటీలను నిర్వహించినారు, ఈ పోటీలలో విజేతలయిన విద్యార్థులకు బహుమతులను అందచేశారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డా. ఎ. చంద్రశేఖర్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డా. పూర్ణ నాగశ్రీ, డా. ఉమాశంకర్, అధ్యాపకులు, సిబ్బంది, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు.