BREAKING
ట్రంప్-జిన్‌పింగ్ భేటీలో కీలక ఒప్పందం.. అమెరికా బొగ్గు కొనుగోళ్లకు చైనా హామీ, కొనసాగుతున్న సుంకాల చర్చలు ఆసియా క్రీడలు 2026 డే 8 షెడ్యూల్.. రేపు బరిలోకి దిగనున్న భారత అథ్లెట్లు, పతక పోరు వివరాలు ఆమె క‌విత్వం ఆత్మ విశ్వాసానికి ప్ర‌తీక‌.. 4(A) నేవల్ మెడికల్ యూనిట్ NCC వార్షిక తనిఖీ – ‘శిక్షణ’ బహుళ ప్రయోజన శిక్షణా మందిరం ప్రారంభం వాహనాల అతివేగానికి కళ్లెం...? శిథిలావస్థలో మద్ది బ్రిడ్జి..! భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మహా దారుణం..! అవంతిలో ఘనంగా ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవ వేడుకలు ఒరాకిల్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.8,200 కోట్ల విలువైన స్టాక్ ఆప్షన్లు.. షేర్ల పతనంతో చిక్కుల్లో పడ్డ నాయకత్వం ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు ముమ్మరం ఇతర రాష్ట్రాల ఆజ్ఞలను పాటిస్తున్నారు విద్యుత్ రంగాన్ని రేవంత్ ప్రభుత్వం నాశనం చేసింది వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ డైవర్షన్ డ్రామాలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లో సంచారి సినిమా విడుదల హక్కులను దక్కించుకున్న గాయత్రి ఫిలిమ్స్ మాదాపూర్‌, గచ్చిబౌలిలో 11 హోటళ్ల లైసెన్సులు రద్దు దౌల్తాబాద్‌లో విషాదం:షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం, రూ.20 లక్షలు, బంగారం బూడిద హైదరాబాద్ జీపీఓ స్థాయిని తగ్గించొద్దు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానికి ఒవైసీ లేఖ

కమలాపురం రైలు నిలుపుదలపై కేంద్ర మంత్రికి వినతి.. రైళ్ల పునరుద్ధరణకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ సీఎం రమేష్ నాయుడు - హామీ

Select Suryaa Now
కమలాపురం రైలు నిలుపుదలపై కేంద్ర మంత్రికి వినతి..   రైళ్ల పునరుద్ధరణకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ సీఎం రమేష్ నాయుడు - హామీ

కమలాపురం రైలు నిలుపుదలపై కేంద్ర మంత్రికి వినతి..


రైళ్ల పునరుద్ధరణకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ సీఎం రమేష్ నాయుడు - హామీ


కమలాపురం మేజర్ న్యూస్

కడప జిల్లాకు విచ్చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ సి.ఎం. రమేష్ నాయుడులను రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు పుత్తా నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో కమలాపురం రైలు నిలుపుదల సాధన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. కోవిడ్‌ సమయంలో కమలాపురం రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లకు ఉన్న నిలుపుదలలను తొలగించారని, కోవిడ్‌ అనంతరం పరిస్థితులు సాధారణమైనప్పటికీ వాటిని తిరిగి పునరుద్ధరించలేదని కమిటీ సభ్యులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ సి.ఎం. రమేష్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. కమలాపురం ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, గతంలో నిలిచిన అన్ని రైళ్లకు తిరిగి నిలుపుదల కల్పించాలని కోరారు. కమలాపురం రైల్వే సమస్యపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించి, గతంలో కమలాపురంలో నిలిచిన రైళ్లను తిరిగి ఆపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే ఎంపీ సి.ఎం. రమేష్ నాయుడు కూడా రైళ్ల నిలుపుదల సమస్యపై సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైలు నిలుపుదల సాధన కమిటీ సభ్యులు సురేష్ బాబు, జూటూరు విజయ్, వెదురూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ కమలాపురం రైల్వే స్టేషన్‌లో గతంలో ఉన్న రైళ్ల నిలుపుదలలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైళ్ల నిలుపుదల సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభించాలని ఆకాంక్షించారు..