మున్సిపల్ దుకాణాల వేలానికి నామమాత్రపు స్పందన
అధిక అద్దె రేట్లే కారణమా..?
రాజకీయ కోణం ఉందా..?
శామీర్‌పేట, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 26):
మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ దుకాణాల బహిరంగ వేలానికి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. మొత్తం 77 దుకాణాలకు వేలం నిర్వహించగా కేవలం 21 దుకాణాలకే వేలం పూర్తయింది. మరో 56 దుకాణాలకు స్పందన లేకపోవడంతో త్వరలో తిరిగి వేలం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
*అధిక అద్దె రేట్లే కారణమా?..
*రాజకీయ కోణం ఉందా?.…
దుకాణాలకు నిర్ణయించిన అద్దె రేట్లు అధికంగా ఉండటమే వ్యాపారుల నుంచి స్పందన తగ్గడానికి కారణమా? లేక వేలానికి స్పందన లేకపోవడం వెనుక మరేదైనా కారణం ఉందా? అనే చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది. రాజకీయ కోణం ఉందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నప్పటికీ, దీనిపై ఎలాంటి ఆధారాలు లేదా అధికారిక ప్రకటన వెలువడలేదు. స్పందన తగ్గడానికి అసలు కారణాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.మిగిలిన 56 దుకాణాలకు త్వరలో కొత్తగా వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నిబంధనల ప్రకారం దరఖాస్తులు చేసుకుని వేలంలో పాల్గొనాలని సూచించారు. వేలం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి మున్సిపాలిటీకి ఆదాయం సమకూరేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ జాము రవి, వైస్ చైర్‌పర్సన్ మోర్సుబాయ్ శశిరేఖ, కమిషనర్ ఆర్. వెంకట గోపాల్, రెవెన్యూ అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ రవి గౌడ్