telanagana
గత చరిత్ర ఆనవాళ్లకు..ఘనమైన కీర్తి.
Telanagana
25 Sep 2026
75 views
:పర్యాటక దినోత్సవానికి రాయికల్ త్రికుటాలయం వేదిక
:దేశంలోనే రెండవ పంచముఖ లింగేశ్వర ఆలయంగా గుర్తింపు
వెయ్యేళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం.. రాయికల్ గుడికోట
:చాళుక్య–కాకతీయుల శిల్పకళకు అద్భుత నిదర్శనం
:ఈనెల 27న పర్యాటక దినోత్సవ వేడుకలకు సిద్ధం
సూర్య,రాయికల్
పచ్చని చెట్ల ప్రకృతి రమణీయత మధ్య.. తలాపున లకుమాంబ చెరువు.. పచ్చని పంట పొలాల ప్రకృతి రమణీయత మధ్య గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తూ ఘనమైన కీర్తిని పొందుతున్న అరుదైన పంచముఖ లింగేశ్వరుడి క్షేత్రం .. ఒకే ప్రాంగణంలో శివ,కేశవ,సూర్య దేవాలయాలు నెలకొన్న అపురూపమైన శిల్పకళ ఆలయం.. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతన్నదిరాయికల్ పట్టణంలోని అతి ప్రాచీన దేవాలయం “త్రికుటాలయం(పంచముఖ లింగేశ్వరాలయం)”గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన పురాతన కట్టడాలు నాటి సంస్కృతి, సంప్రదాయాలు,కళా వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేస్తుంటాయి. అలాంటి అరుదైన చారిత్రక కట్టడాల్లో జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని శ్రీ చెన్నకేశవనాథ (పంచముఖ లింగేశ్వర స్వామి) త్రికూటాలయం ఒకటి.స్థానికంగా గుడికోట గా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక,శిల్పకళా సంపదకు ప్రతీకగా నిలుస్తోంది.
చాళుక్యుల కాలం నుంచి కాకతీయుల వరకు..
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆలయ నిర్మాణం క్రీ.శ. 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల కాలంలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అనంతరం కాకతీయుల చివరి రాజు ప్రతాపరుద్రుడి కాలంలో క్రీ.శ. 1304 ప్రాంతంలో ఆలయం మరింత అభివృద్ధి చెందినట్లు చారిత్రక వివరాలు పేర్కొంటున్నాయి. నాటి రాజుల కళాభిరుచి, నిర్మాణ నైపుణ్యం, శిల్పుల ప్రతిభకు ఈ ఆలయం నేటికీ సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.పూర్వం రాయికల్‌ను రావి కంటిగా పిలిచేవారని స్థానిక చరిత్ర చెబుతోంది.ఆలయం చుట్టూ మట్టితో నిర్మించిన కోట బురుజులు ఉండటంతో కాలక్రమంలో ఇది ‘గుడికోట’గా ప్రసిద్ధి చెందిందని చెబుతారు.
ఐదు ముఖాలతో మహిమాన్వితమైన శివలింగం
గుడికోట ఆలయానికి ప్రధాన ఆకర్షణ పంచముఖ లింగేశ్వర స్వామి.ఐదు ముఖాలతో దర్శనమిచ్చే ఈ శివలింగం ఆలయానికి ప్రత్యేక ఆధ్యాత్మిక గుర్తింపును తెచ్చింది. అరుదైన పంచముఖ శివలింగ క్షేత్రంగా రాయికల్ గుడికోటకు ప్రత్యేక స్థానం ఉందని భక్తులు విశ్వసిస్తారు.
ఒకే ప్రాంగణంలో శివ–కేశవ–సూర్య దర్శనం
త్రికూటాలయ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న ఈ ఆలయంలో మూడు గర్భాలయాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. పడమర వైపున పంచముఖ లింగేశ్వర స్వామి, ఉత్తర గర్భగుడిలో శ్రీ కేశవనాథ స్వామి (చెన్నకేశవుడు),తూర్పు గర్భగుడిలో సూర్యనారాయణ స్వామి కొలువై ఉన్నారు.ఒకే ఆలయ ప్రాంగణంలో శివుడు,విష్ణువు,సూర్యుడు కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత.అందుకే భక్తులు దీనిని హరిహర క్షేత్రంగా భావిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.
రాతిలో చెక్కిన అద్భుత కళా వైభవం
ఆలయంలో అడుగడుగునా కనిపించే శిల్పాలు నాటి శిల్పుల అసాధారణ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నల్ల గ్రానైట్ రాతితో నిర్మించిన ప్రధాన మండపంలోని స్తంభాలపై వివిధ దేవతా రూపాలు, విష్ణుమూర్తి దశావతారాలకు సంబంధించిన శిల్పాలను సుందరంగా చెక్కారు.మత్స్య,కూర్మ, వరాహ, నరసింహ తదితర అవతారాల శిల్పాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. గర్భాలయ ద్వారబంధాలపై కనిపించే ద్వారపాలకులు,గజలక్ష్మి, చామరధారిణుల శిల్పాలు కాకతీయుల శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
16 రేకుల పద్మం.. అబ్బురపరిచే భువన శిల్పం
ఆలయ అంతర్భాగంలోని పైకప్పుపై చెక్కిన 16 రేకుల పద్మాకార భువన శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాతిని ఇంతటి సున్నితమైన ఆకృతుల్లో మలిచిన తీరు నేటి తరానికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చరిత్ర, ఆధ్యాత్మికత, శిల్పకళ కలగలిసిన ఈ క్షేత్రం పర్యాటకులకు ఒక అపూర్వ అనుభూతిని అందిస్తుంది.

చారిత్రక సంపదను కాపాడాల్సిన బాధ్యత
శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న రాయికల్ గుడికోట కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు.. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్రతీక. ప్రభుత్వం సైతం ఆలయ ప్రాధాన్యతను గుర్తించి పర్యాటక దినోత్సవం,మహాశివరాత్రి వంటి సందర్భాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది.చారిత్రక ప్రాధాన్యతను మరింతగా వెలుగులోకి తీసుకువచ్చి, ఆలయ పరిసరాలను అభివృద్ధి చేసి, రాబోయే తరాలకు ఈ అపూర్వ వారసత్వ సంపదను భద్రపరచాల్సిన అవసరం ఉంది.రాయికల్ గుడికోటను మరింత విస్తృతంగా పర్యాటక పటంలో నిలిపితే జగిత్యాల జిల్లాకు మరో విశిష్ట పర్యాటక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు సిద్ధం.ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన పంచముఖ లింగేశ్వర త్రికుటాలయమును మరింత ప్రాచుర్యం కల్పించే విధంగా ఆలయ అభివృద్ధికి నాంది వేసే విధంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ చరిత్రను అందరికీ తెలిపే విధంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.దీనికి తోడు జిల్లా పర్యాటక శాఖ,రాయికల్ పురపాలక పాలకవర్గం సభ్యులు సైతం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు.జిల్లా కలెక్టర్ ఆదేశాలతో త్రికుటాలయం వద్ద వేడుకలకు అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్,చైర్మన్ కట్కం రవీందర్, ఆలయ కమిటీ చైర్మన్ మచ్చ శ్రీధర్ తెలిపారు.
ట్యాగ్లు:
devotional