BREAKING
క్యాషియో  జాతీయస్థాయి మ్యూజిక్ పోటీలలో పారమిత విద్యార్థికి మూడవస్థానం మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ దండే విఠల్ ఆలియా భట్ - సంజయ్ లీలా భన్సాలీ క్రేజీ కాంబో.. మరో బ్లాక్‌బస్టర్‌ రిపీట్ అవుతుందా? ఇంటికి వచ్చిన నక్షత్ర తాబేలు అడవిలోకి.. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా చేపట్టాలి మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డిని కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న కరీంనగర్ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం కరీంనగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. 30న నూతన కలెక్టరేట్ ప్రారంభం విద్యకు కలెక్టర్‌ భరోసా అనాథ వృద్ధులకు లీగల్ అవేర్నెస్ ప్రధాని మోదీతో మహిళ మార్ఫింగ్ ఫొటో వివాదం.. తక్షణమే తొలగించాలని మెటాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ 27వ తేదీ యధావిధిగా పని చేయనున్న ప్రభుత్వరంగా,గ్రామీణ బ్యాంకులు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి

తిరుమలలో అనంత పద్మనాభస్వామి వ్రతం సందర్భంగా చక్రస్నానం

Select Suryaa Now
తిరుమలలో అనంత పద్మనాభస్వామి వ్రతం  సందర్భంగా చక్రస్నానం

తిరుమల మేజర్ న్యూస్,

అనంత పద్మనాభవ్రతం సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం.

తిరుమలలో అనంత పద్మనాభవ్రతం సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. 

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్లు, ప‌సుపు, చంద‌నంతో విశేషంగా అభిషేకం చేపట్టారు. అనంత‌రం చక్రస్నానం నిర్వహించారు.

శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనాభస్వామికి అంతే వైశిష్ఠ్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. 

తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. 

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.