telanagana
రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
Telanagana
25 Sep 2026
22 views
అధికారులు తరచుగా తనిఖీలు చేపట్టాలి
హోర్డింగుల ఏర్పాటులో నిబంధనలు అతిక్రమించొద్దు
సూర్య కరీంనగర్ ప్రతినిధి ;
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ
రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..అధికారులు తరచుగా తనిఖీలు చేస్తూ రోడ్ వర్క్ పనులు, ప్రమాదకర ప్రదేశాలు గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండానిబంధనలకు లోబడే హోర్డింగులు, ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలన్నారు.కార్పొరేషన్ పరిధిలోకోర్టు, బస్టాండ్ వద్ద తరచుగా పైపులైన్ కు లీకేజీ ఏర్పడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. సర్కిల్ వారీగా తనిఖీలు చేసి సమస్యలు గుర్తించి పరిష్కరించాలని సూచించారు. అదనపు డీసీపీ వెంకటరమణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, హిట్ అండ్ రన్ కేసుల వివరాలు వివరించారు. ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జంక్షన్ నుంచి పద్మనగర్ వెళ్లే రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాన రహదారిపై రోడ్లపైకి వచ్చిన చెట్ల కొమ్మలను తొలగించాలని అధికారులకు సూచించారు.కరీంనగర్ - వరంగల్ రహదారి పనులు 99 శాతం పూర్తయ్యాయని.. హైవేను నిరంతరం సిసి కెమెరాల ద్వారా మానిటర్ చేస్తున్నట్లు ఎన్ హెచ్ఏఐ అధికారులు వివరించారు. ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.నిర్ణీత వేగం దాటితే ఆటోమేటిక్ చలాన్లు విధిస్తూ.. ఎమర్జెన్సీ కాల్ బాక్సులు, సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీటీఓ జైపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఏఎంవీలు తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్లు:
Latest News