BREAKING
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'కళ్యాణం కమనీయం జీవితం' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? నన్ను ఎంతైనా అవమానించండి.. ప్రజలు మాత్రం ఇప్పుడైనా మేల్కొండి: యాంకర్ రష్మి గౌతమ్! రైతు కూలీల సమస్యలపై ఐక్య పోరాటం యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చిన్నారి అత్యాచారం కేసులు నిందితునికి జీవిత ఖైదు ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్‌ శ్రీరాములు గత చరిత్ర ఆనవాళ్లకు..ఘనమైన కీర్తి. భూసేకరణలో దళారులను నమ్మొద్దు నష్టపరిహారం నేరుగా బాధితులకే.. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తమిళంలో కీర్తిసురేశ్ 'డొరొథి' మూవీపై ట్రోల్స్ వర్షం.. అసలు కారణం అదేనా! విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై షీ టీమ్‌ అవగాహన ఈ నేషనల్ అవార్డు నాది కాదు, మా ఆవిడదే.. డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం కార్యక్రమం.. గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన (ట్రైనీ) సబ్ కలెక్టర్ హరిణి. మిడ్ మానేరు త్యాగాలకు విలువేది?

ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా చేపట్టాలి

Select Suryaa Now
ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు పకడ్బందీగా చేపట్టాలి
సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కలిసి సమీక్ష సమావేశం
 
జిల్లా ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్
 
 సూర్య నిర్మల్ ప్రతినిధి
 
ఖరీఫ్ పంటల కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ రెవెన్యూ రాథోడ్ రమేష్ అధికారులను ఆదేశించారు.    
కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కలిసి ఖరీఫ్ (వానాకాలం) వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేస్తూ, పంట కొనుగోలును పకడ్బందీగా చేపట్టాలన్నారు. గతంలో క్షేత్రస్థాయిలో ఎదురైన అనుభవాల దృష్ట్యా తగిన ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి సమస్యలు కలగకుండా చూడాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని వివరించారు. వ్యవసాయ అధికారులు మండలాల వారీగా వివరాలు సేకరించి, తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కు సంబంధించి సామాగ్రి అంతా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, వ్యవసాయ అధికారి సుజాత, తూనికలు కొలతల అధికారి శంకర్, డిసిఓ నర్సయ్య, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.