BREAKING
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'కళ్యాణం కమనీయం జీవితం' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? నన్ను ఎంతైనా అవమానించండి.. ప్రజలు మాత్రం ఇప్పుడైనా మేల్కొండి: యాంకర్ రష్మి గౌతమ్! రైతు కూలీల సమస్యలపై ఐక్య పోరాటం యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చిన్నారి అత్యాచారం కేసులు నిందితునికి జీవిత ఖైదు ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్‌ శ్రీరాములు గత చరిత్ర ఆనవాళ్లకు..ఘనమైన కీర్తి. భూసేకరణలో దళారులను నమ్మొద్దు నష్టపరిహారం నేరుగా బాధితులకే.. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తమిళంలో కీర్తిసురేశ్ 'డొరొథి' మూవీపై ట్రోల్స్ వర్షం.. అసలు కారణం అదేనా! విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై షీ టీమ్‌ అవగాహన ఈ నేషనల్ అవార్డు నాది కాదు, మా ఆవిడదే.. డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం కార్యక్రమం.. గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన (ట్రైనీ) సబ్ కలెక్టర్ హరిణి. మిడ్ మానేరు త్యాగాలకు విలువేది?

ఇంటికి వచ్చిన నక్షత్ర తాబేలు అడవిలోకి..

Select Suryaa Now
ఇంటికి వచ్చిన నక్షత్ర తాబేలు అడవిలోకి..
 
సూర్య కాగజ్‌నగర్‌
 
 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని   ఇస్గాం మూడో నంబర్‌ గ్రామ ప్రాంతంలోని మనీష్‌ నివాసానికి రాత్రి కురిసిన వర్షం కారణంగా అరుదైన నక్షత్ర తాబేలు రావడంతో అటవీ అధికారులకు సమాచారం అందింది. రేంజ్‌ అధికారి లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు వేంపల్లి సెక్షన్‌ అధికారి శశిధర్‌బాబు, ఇస్గాం బీట్‌ అధికారి ఎం.వాణి, వాచర్‌ దేవ్‌సింగ్‌ అక్కడికి చేరుకుని తాబేలును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇస్గాం పరిధిలోని సురక్షిత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
 
నక్షత్ర తాబేలుకు ప్రత్యేక రక్షణ
 
నక్షత్ర తాబేలు వన్యప్రాణి (సంరక్షణ) చట్టం–1972లోని షెడ్యూల్‌–1లో ఉండటంతో అత్యంత రక్షణ కలిగిన వన్యప్రాణుల జాబితాలో ఉంది. వన్యప్రాణులను ఇంట్లో పెంచడం, అక్రమంగా తరలించడం చట్టరీత్యా నేరమని అటవీ అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి సెక్షన్‌ 51 ప్రకారం 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు కనీసం రూ.25 వేల జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.