BREAKING
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'కళ్యాణం కమనీయం జీవితం' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? నన్ను ఎంతైనా అవమానించండి.. ప్రజలు మాత్రం ఇప్పుడైనా మేల్కొండి: యాంకర్ రష్మి గౌతమ్! రైతు కూలీల సమస్యలపై ఐక్య పోరాటం యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చిన్నారి అత్యాచారం కేసులు నిందితునికి జీవిత ఖైదు ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్‌ శ్రీరాములు గత చరిత్ర ఆనవాళ్లకు..ఘనమైన కీర్తి. భూసేకరణలో దళారులను నమ్మొద్దు నష్టపరిహారం నేరుగా బాధితులకే.. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తమిళంలో కీర్తిసురేశ్ 'డొరొథి' మూవీపై ట్రోల్స్ వర్షం.. అసలు కారణం అదేనా! విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై షీ టీమ్‌ అవగాహన ఈ నేషనల్ అవార్డు నాది కాదు, మా ఆవిడదే.. డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం కార్యక్రమం.. గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన (ట్రైనీ) సబ్ కలెక్టర్ హరిణి. మిడ్ మానేరు త్యాగాలకు విలువేది?

కరీంనగర్ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం

Select Suryaa Now
కరీంనగర్ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం
 
 
రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం.. వారికి నిరంతరం అండగా ఉండాలి
 
వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
 
మంత్రిని కలిసిన కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న..
 
సూర్య కరీంనగర్
 
కరీంనగర్ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం అండగా నిలవాలని కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్నకు సూచించారు.
శుక్రవారం హైదరాబాద్‌లో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావుతో కలిసి కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కరీంనగర్ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, మార్కెట్‌ను ఆధునికీకరించేందుకు అవసరమైన నిధుల మంజూరు, రైతులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం తదితర అంశాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో నరసన్న చర్చించారు. రాబోయే ధాన్యం కొనుగోలు సీజన్‌లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేపట్టనున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రికి వివరించారు. ప్రభుత్వ సహకారంతో కరీంనగర్ మార్కెట్ యార్డ్‌లో నిర్మించిన సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్న విషయాన్ని కూడా నరసన్న మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.
కరీంనగర్ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలకు సహకరిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారని నరసన్న తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు పడాల అజయ్ పాల్గొన్నారు.