telanagana
విద్యకు కలెక్టర్ భరోసా
Telanagana
25 Sep 2026
24 views
By సూర్య ప్రతినిధి
Updated : 25 Sep 2026 18:43 IST
Select Suryaa Now
సూర్య ఆదిలాబాద్
ఆర్థిక ఇబ్బందులతో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సిరికొండ మండలం నారాయణపూర్‌కు చెందిన గిరిజన విద్యార్థి సీడం అర్జున్ ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో బీఎస్సీ (ఆనర్స్) ఫిజిక్స్‌లో సీటు సాధించాడు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో అర్జున్‌కు రూ.50 వేల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు.గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థి జాతీయ స్థాయి కళాశాలలో సీటు సాధించడం అభినందనీయమన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని తెలిపారు. సహాయం అందించిన కలెక్టర్‌కు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఏవో వర్ణ తదితరులు పాల్గొన్నారు.