telanagana
కరీంనగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. 30న నూతన కలెక్టరేట్ ప్రారంభం
Telanagana
25 Sep 2026
27 views
By సూర్య ప్రతినిధి
Updated : 25 Sep 2026 18:44 IST
Select Suryaa Now
సూర్య కరీంనగర్
ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్‌లో నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో డీసీసీ కార్యాలయంలో కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ సన్నాహక సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సీఎం పర్యటనకు ఘన స్వాగత ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.అలాగే SIR ప్రక్రియలో సాంకేతిక లోపాలను పరిష్కరించి, గడువును డిసెంబర్ వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈనెల 28న ఓటు చోరీ అంశంపై కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీకి, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని, వ్యక్తిగత వర్గాలకు దూరంగా ఉండాలని నాయకులు సూచించారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.