telanagana
క్యాషియో జాతీయస్థాయి మ్యూజిక్ పోటీలలో పారమిత విద్యార్థికి మూడవస్థానం
Telanagana
25 Sep 2026
26 views
By సూర్య ప్రతినిధి
Updated : 25 Sep 2026 18:53 IST
Select Suryaa Now
సూర్య కరీంనగర్
ఇటీవల క్యాషియో, మాస్టర్ మ్యూజిక్ వారు ఆన్లైన్ లో నిర్వహించిన సంగీత పోటీలలో స్థానిక పద్మనగర్ లోని పారమిత హెరిటేజ్ పాఠశాల 8వ తరగతికి చెందిన కె.చరణ్ జాతీయస్థాయి లో మూడవస్థానం పొందాడని పాఠశాల డైరెక్టర్ కె.హన్మంత రావు తెలిపారు.జాతీయస్థాయిలో అవార్డు పొందిన విద్యార్థిని , మ్యూజిక్ టీచర్ జితుమణి శర్మ ను పారమిత పాఠశాలల అధినేత డా. ఇనుగంటి ప్రసాదరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారమిత పాఠశాల కేవలం చదువుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కి కృషిచేస్తుందని తెలిపారు. జాతీయస్థాయిలో అవార్డులు పొందిన విద్యార్థిని , సంగీత ఉపాధ్యాయుడు పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాద రావు, డైరెక్టర్లు ప్రసూన, అనూకర్ రావు, రష్మిత, రాకేష్, వి.యు.యం. ప్రసాద్, వినోద్ రావు, ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హన్మంత రావు, ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ, సమన్వయకర్తలు రబీంద్రపాత్రో, భవానీ, నిఖిత, సంగీత ఉపాధ్యాయులు జితుమణి శర్మ లు పాల్గొన్నారు.