telanagana
అనాథ వృద్ధులకు లీగల్ అవేర్నెస్
సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణ మున్సిపల్ పరిధిలోని టి ఆర్ నగర్ లో శ్రీ గాయత్రి విశ్వకర్మ అనాథ వృద్ధుల ఆశ్రమంలో సబ్ జడ్జి సరిత మట్ట శుక్రవారం వృద్ధుల ఆరోగ్యం గురించి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. లీగల్ అవేర్నెస్ గురించి చెప్పడం జరిగింది. అనంతరం వృద్ధులకు అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వేల్ ఫేర్ ఆఫీసర్ భాస్కర్, ఆశ్రమ నిర్వాహకులు అధ్యక్ష కార్యదర్శి టి వి సూర్యం , ముమ్మడి నాగ భూషణం ఆఫీసర్ స్టాఫ్ పాల్గొన్నారు