బయనపల్లిలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవం
చెన్నూరు మేజర్ న్యూస్ :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా చెన్నూరు మండలం బయనపల్లిలో శుక్రవారం అంగన్‌వాడీ ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు.
బయనపల్లి-1, బయనపల్లి-5 అంగన్‌వాడీ కేంద్రాల్లో జరిగిన కార్యక్రమంలో కమలాపురం అంగన్‌వాడీ ఉత్సవ ఇన్‌చార్జి,కడప జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు సంఘట రామ్మోహన్‌రెడ్డి,చెన్నూరు మండల బీజేపీ అధ్యక్షుడు పి.వెంకటరామిరెడ్డి,మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు చీమల అంకిరెడ్డి,ఐసీడీఎస్ సీడీపీవో గుర్రమ్మ పాల్గొని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, వాటి ప్రాధాన్యతను వారు వివరించారు.అనంతరం గర్భిణులు, బాలింతలను సన్మానించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఎం.రామలచ్చమ్మ, టి.రమాదేవి,ఆయాలు,ఆశా వర్కర్లు,మోహన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి,టీడీపీ కార్యకర్తలు,గ్రామ మహిళలు,బీజేపీ నాయకులు పాల్గొన్నారు.