ఘట్‌కేసర్ అభివృద్ధికి నిధులివ్వండి
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్(సెప్టెంబరు 26): ఘట్‌కేసర్ డివిజన్‌లో 32 అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.32 కోట్ల 46 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి తదితరులు కమిషనర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఘట్‌కేసర్ డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనతో పాటు వివిధ అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని నాయకులు వివరించారు. ఇందుకోసం ప్రతిపాదించిన 32 పనులకు రూ.32.46 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ కడుపోళ్ల మల్లేష్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ గుర్రం రమేష్.