ఎల్లంపేట్ మున్సిపాలిటీలో వైభవంగా బీజేపీ ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమం
మేడ్చల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 26):భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమంలో భాగంగా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లంపేట్, బండమాదారం వార్డుల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను బీజేపీ నాయకులు సందర్శించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, ఇతర సేవలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలను అభినందిస్తూ వారిని ఘనంగా సన్మానించారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరేలా కృషి చేయాలని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్, కౌన్సిలర్లు అర్చన శ్రీనివాస్, మహేశ్వరి రాజేష్, శారద రాజు నాయక్, జనరల్ సెక్రెటరీ కంచగంట మహేష్, సీనియర్ నాయకులు పోచయ్య ముదిరాజ్, పుష్ప మల్లారెడ్డి, నాగేష్ ముదిరాజ్, రవి నాయక్, లక్ష్మణ్, హరి ప్రసాద్ గౌడ్, నాగార్జున రెడ్డి, చంద్రం, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ తలారి శివకుమార్.