ఇన్-సర్వీస్ టెట్-2 ప్రతిభ చాటిన వి. భరత్ బాబు
మునగాల,మేజర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇన్-సర్వీస్ టెట్-2 ( మ్యాథ్స్& సైన్స్) అర్హత పరీక్షలో మునగాల మండల ఉపాధ్యాయుడు ప్రతిభ చాటారు.
మండల పరిధిలోని జగన్నాథపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న వక్కంతుల భరత్ బాబు 150 మార్కులకు గాను 101 మార్కులు సాధించి తన ప్రతిభను చాటారు.2002 డీఎస్సీ ఉపాధ్యాయుడైన భరత్ బాబు సాధించిన ఈ మార్కులు ఆయన నిబద్ధతకు నిదర్శనమని పలువురు కొనియాడారు. ప్రమోషన్ల కోసం ప్రతి ఉపాధ్యాయుడు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అర్హత సాధించాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో ఆయన విజయం సాధించడం పట్ల తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.