BREAKING
ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఉత్తరాంధ్ర థియేటర్ల జాబితా విడుదల.. అక్టోబర్ 2న భారీ రిలీజ్! విక్రమ్ ప్రభు ‘సిటీ ఆఫ్ గోల్డ్’ ఫస్ట్ లుక్ మరియు మిస్టీరియస్ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్! ఎన్టీఆర్ భావజాల వ్యాప్తిలో అట్లూరి అశ్విన్ పాత్ర చిరస్మరణీయం: టీడీ జనార్దన్ ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రంలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి : హీరో ఫహాద్ ఫాజిల్ కొండగట్టులో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు ఎల్లంపేట్ మున్సిపాలిటీలో వైభవంగా బీజేపీ ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమం పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడతల వారీగా ప్రతి అర్హ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు గుండె ఆరోగ్యం ఫై అవగాహన అక్టోబర్ 9న గ్రాండ్‌గా ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’ వరల్డ్ వైడ్ రిలీజ్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు! గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం.. అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్! సికింద్రాబాద్ జీఎంఆర్ స్ప్రింగ్‌ఫీల్డ్స్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు.. రికార్డు స్థాయిలో రూ.1,62,111కు అమ్ముడైన లడ్డూ తాండూరులో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వైయస్సార్సీపి కార్యాలయంలో పదవుల పండుగ ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించకపోవడంపై పలువురు అసంతృప్తి

Select Suryaa Now
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించకపోవడంపై పలువురు అసంతృప్తి

 

, సూర్య వీణవంక

: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, తెలంగాణ తొలి మహిళా ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మండలంలో వేడుకలు నిర్వహించకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళా చైతన్యానికి, భూమి కోసం భుక్తి కోసం సాగిన పోరాటానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ జయంతిని మండల నాయకులు విస్మరించడం చర్చనీయాంశంగా మారింది.మహిళా హక్కుల కోసం, పేద ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన ఐలమ్మ సేవలను స్మరించుకోవాల్సిన నాయకులు జయంతి వేడుకలు నిర్వహించకపోవడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహనీయుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించి, వారి ఆశయాలను భావితరాలకు తెలియజేయాలని ప్రజలు కోరుతున్నారు.మహనీయుల జయంతులను నిర్వహించడం ద్వారా వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత నాయకులపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.