BREAKING
అధికారం పోయినా.. అరాచకం తగ్గలేదు ..? ఐసిడిఎస్‌పై కలెక్టర్ సమీక్ష జడ్పీ పీఠం దిశగా కోటపాటి జనార్ధనరావు ఘట్‌కేసర్‌ అభివృద్ధికి నిధులివ్వండి ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఉత్తరాంధ్ర థియేటర్ల జాబితా విడుదల.. అక్టోబర్ 2న భారీ రిలీజ్! విక్రమ్ ప్రభు ‘సిటీ ఆఫ్ గోల్డ్’ ఫస్ట్ లుక్ మరియు మిస్టీరియస్ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్! ఎన్టీఆర్ భావజాల వ్యాప్తిలో అట్లూరి అశ్విన్ పాత్ర చిరస్మరణీయం: టీడీ జనార్దన్ ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రంలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి : హీరో ఫహాద్ ఫాజిల్ కొండగట్టులో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు ఎల్లంపేట్ మున్సిపాలిటీలో వైభవంగా బీజేపీ ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమం పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడతల వారీగా ప్రతి అర్హ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు గుండె ఆరోగ్యం ఫై అవగాహన అక్టోబర్ 9న గ్రాండ్‌గా ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’ వరల్డ్ వైడ్ రిలీజ్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు! గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం.. అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్!

వైయస్సార్సీపి కార్యాలయంలో పదవుల పండుగ

Select Suryaa Now
 వైయస్సార్సీపి కార్యాలయంలో పదవుల పండుగ

వైయస్సార్సీపి కార్యాలయంలో పదవుల పండుగ 

పదవులు లభించిన వారిని సత్కరించిన వైఎస్ఆర్సిపి నేత వడ్డీ రఘురాం

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు పొందిన నాయకులను పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా తాడేపల్లిగూడెం మున్సిపల్ విభాగంలో ఉపాధ్యక్షులుగా కాకర్ల శ్రీనివాసు, పట్నాల గణపతి, ప్రధాన కార్యదర్శి బండి నరసింహారావు, చామన సూర్య చంద్రరావు, కార్యదర్శులుగా కొరపాటి వెంకటేశ్వరరావు, ఎం.డి. రఫీలను ఎన్నిక చేసి వారిని సత్కరించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులు గా వీర్ల వెంకటేష్, మున్సిపల్ యూత్ వింగ్ అధ్యక్షులుగా మారిశెట్టి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా దత్తి సాయి, కార్యదర్శులుగా పాణ్యం శ్రీనివాస రెడ్డి, వంగీత వాసు, సీరందాసు దుర్గ ప్రసాద్లను నియమించి వారిని ఘనంగా సత్కరించారు. రూరల్ మండల యూత్ వింగ్ అధ్యక్షులుగా ఎన్నికైన కనకపాటి ప్రశాంత్ ను సన్మానం చేశారు. వివిధ హోదాల్లో బాధ్యతలు స్వీకరించిన నాయకులకు శాలువాలు కప్పి, పుష్ప గుచ్ఛాలు అందించి వడ్డీ రఘురామ్ నాయుడు అభినందనలు తెలిపారు. పార్టీకి మరింత సేవ చేయాలని, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సత్కారం అందుకున్న నాయకులు వడ్డీ రఘురామ్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.

 

 శ్రీనివాస్ తాడేపల్లిగూడెం