విక్రమ్ ప్రభు ‘సిటీ ఆఫ్ గోల్డ్’ ఫస్ట్ లుక్ మరియు మిస్టీరియస్ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలెంటెడ్ హీరో విక్రమ్ ప్రభు కెరీర్‌లో 26వ సినిమాగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'సిటీ ఆఫ్ గోల్డ్'. సిద్ధార్థ్ దర్శకత్వంలో రోమియో పిక్చర్స్ బ్యానర్‌పై రాహుల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మిస్టీరియస్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. విడుదలైన క్షణాల వ్యవధిలోనే ఈ అప్‌డేట్‌కు సినీ వర్గాల నుంచి మరియు సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. బంగారం వ్యాపారం వెనుక ఉండే ఎవరికీ తెలియని రహస్యాలు మరియు చీకటి ప్రపంచం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతోంది.
ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు సరసన శివత్మిక రాజశేఖర్ కథానాయికగా నటిస్తుండగా, ఇంటర్నెట్ సెన్సేషన్ అమలా షాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విక్రమ్ ప్రభు ఎంతో ఇంటెన్సివ్‌గా కూర్చుని చాలా క్యాజువల్‌గా బంగారు కడ్డీలను పైకి విసురుతూ పట్టుకుంటున్నట్లు కనిపించారు. బంగారం విలువను, దాని చుట్టూ అల్లుకున్న మిస్టీరియస్ ప్రపంచాన్ని ఈ విజువల్స్ అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి. ఇక గ్లింప్స్ విషయానికి వస్తే, కోయంబత్తూర్, చెన్నై, కేరళ వంటి ప్రాంతాలలో విస్తృతంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో బంగారం మార్కెట్, అక్కడ పనిచేసే వ్యక్తుల జీవితాలు, సామాన్య ప్రజలకు తెలియని రహస్య వ్యవస్థను చాలా సహజంగా చూపించారు.
విక్రమ్ ప్రభు పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా, అలగం పెరుమాళ్, జాఫర్ ఇడుక్కి, జీఎం సుందర్, వసుంధర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ శరాజ్ సినిమాటోగ్రఫీ ఈ డార్క్ అండ్ మిస్టీరియస్ ప్రపంచాన్ని అత్యంత రిచ్‌గా ఆవిష్కరించగా, మ్యూజికల్ మాంత్రికుడు యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. విభిన్నమైన కాన్ప్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు కెరీర్‌లో మరొక బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.