BREAKING
ప్రజాస్వామ్యంపై వినాశకర దాడి.. ఎన్నికల సంఘం వివాదంపై శశి థరూర్ తీవ్ర ఆందోళన ప్రొద్దుటూరు అభివృద్ధికి కేంద్ర మంత్రులకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వినతి ప్రొద్దుటూరులో 45 రోజుల ఎగ్జిబిషన్‌కు 28న టెండర్‌-కం-బహిరంగ వేలం దాతల భక్తితో.. సీతారామాలయానికి సువర్ణ వైభవం అణు వ్యవహారంలో వెనక్కి తగ్గేదే లేదు.. అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక! నేనావత్ . పాండు లడ్డు పాట 61,000. ఆది సాయికుమార్ ఎస్‌ఐ యుగంధర్ టీజర్ విడుదల.. మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన హీరో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఘన స్వాగతం బ్రిక్స్ వర్సెస్ ఐరాస కాదు.. ఐక్యరాజ్యసమితికి బ్రిక్స్ ఎల్లప్పుడూ మద్దతుగానే ఉంటుంది: విదేశాంగ మంత్రి జైశంకర్ ఓటర్ల జాబితాల సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. సాఫ్ట్‌వేర్‌పై సమగ్ర సమీక్షకు ఆదేశం! ఢిల్లీలో స్వచ్ఛతా అభియాన్ పనుల్లో బయటపడ్డ కృత్రిమ అస్థిపంజరం.. హడలెత్తిపోయిన సిబ్బంది, దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీజేపీ ఎంపీ టికెట్ ఆఫర్ చేశారంటూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై కేరళ మాజీ సీఎస్ జిజి థామ్సన్ సంచలన ఆరోపణలు పోట్లీ మహరాజ్ ఆలయ చైర్మన్‌గా సుదర్శన్ గౌడ్ పేరు ఖరారు హైకోర్టు న్యాయమూర్తి కి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ హార్ముజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ పెట్టిన వారం రోజుల గడువు ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్.. తీవ్ర ఉద్రిక్తతలు

ఫోటోలు కోసం పర్యవేక్షణ వద్దు సత్వరమే చర్యలు తీసుకోవాలి. ... వైఎస్ఆర్సిపి నేత వడ్డి రఘురామ్

Select Suryaa Now
ఫోటోలు కోసం పర్యవేక్షణ వద్దు  సత్వరమే చర్యలు తీసుకోవాలి. ... వైఎస్ఆర్సిపి నేత వడ్డి రఘురామ్

ఫోటోలు కోసం పర్యవేక్షణ వద్దు  సత్వరమే చర్యలు తీసుకోవాలి. ... వైఎస్ఆర్సిపి నేత వడ్డి రఘురామ్

ఎర్రకాలువ ముంపు పొలాలను పరిశీలించిన వైఎస్ఆర్సిపి నేత వడ్డి రఘురామ్

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; అకాల వర్షాల వల్ల ముంపు కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వడ్డి రఘురామ్ నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. నందమూరు, మారంపల్లి, జగన్నాథపురం, దండగర్ర, మాధవరం గ్రామాల్లో పర్యటించిన వడ్డి రఘురామ్ నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను, పంట నష్టాన్ని, పెట్టుబడుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వడ్డి రఘురామ్ మాట్లాడుతూ ముంపు కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట పొలాల్లో ఎంత మేరకు నష్టం జరిగిందో అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని కోరారు. రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా ముంపు ప్రాంతాలను అధికారులు స్వయంగా పరిశీలించి పంట నష్టాన్ని నమోదు చేయాలని అన్నారు. ఒక్క పార్టీ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కంటే మూడు పార్టీలు మూడు రెట్లు ఇవ్వాలి. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పంట నష్టం జరిగిన సమయంలోనే పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకున్నామని వడ్డి రఘురామ్ నాయుడు పేర్కొన్నారు. ముంపు కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు కనీసం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు తక్షణ సాయం అందించాలని కోరారు. నందమూరు అక్విడెక్ట్ వద్ద గుర్రపు డెక్క తొలగించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గం లోని ఈ ప్రాంతాలు ప్రతి ఏడాది వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయని వడ్డి రఘురామ్ నాయుడు అన్నారు. ఇదే సమస్య పునరావృతమవుతున్నప్పుడు ముంపును నివారించేందుకు ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటోందో చెప్పాలని ప్రశ్నించారు. ముంపు సమస్యపై ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు తగిన స్థాయిలో స్పందించడం లేదని వడ్డి రఘురామ్ నాయుడు విమర్శించారు. రైతులకు అవసరమైన యూరియా విషయంలో కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వడ్డి రఘురామ్ డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతానికి వచ్చి రైతులతో మాట్లాడి, ఫోటోలు తీసుకుని వెళ్లిపోవడం కాకుండా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వడ్డి రఘురామ్ నాయుడు కోరారు. ముంపు ప్రాంతాల్లోని రైతులకు న్యాయం చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ పర్యటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ తాడేపల్లిగూడెం