BREAKING
ఢిల్లీలో స్వచ్ఛతా అభియాన్ పనుల్లో బయటపడ్డ కృత్రిమ అస్థిపంజరం.. హడలెత్తిపోయిన సిబ్బంది, దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీజేపీ ఎంపీ టికెట్ ఆఫర్ చేశారంటూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై కేరళ మాజీ సీఎస్ జిజి థామ్సన్ సంచలన ఆరోపణలు పోట్లీ మహరాజ్ ఆలయ చైర్మన్‌గా సుదర్శన్ గౌడ్ పేరు ఖరారు హైకోర్టు న్యాయమూర్తి కి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ హార్ముజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ పెట్టిన వారం రోజుల గడువు ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్.. తీవ్ర ఉద్రిక్తతలు రాచమల్లు రమాదేవికి వైఎస్సార్‌సీపీ అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా నియామకం ఆపిల్‌కు రికార్డు స్థాయి జరిమానా ఆసియా క్రీడలలో పతకాల జోరు.. భారత్ ఖాతాలో మరో అద్భుతమైన స్వర్ణాలు మరియు పతకాలు మెనోపాజ్ సమయంలో జీర్ణ సమస్యలు సాధారణమేనా?.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన జాగ్రత్తలు మున్సిపల్ దుకాణాల వేలానికి నామమాత్రపు స్పందన యుబిఎస్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం తరలింపుపై స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి స్పష్టత.. సంచలన ప్రకటన! ఐరాస వేదికగా అమెరికాపై చైనా తీవ్ర ఆగ్రహం క్యూబాతో అమెరికా చారిత్రాత్మక ఒప్పందం ప్రధాని మోడీ చరిత్రకారుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెనిజులా ఎన్నికలపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

జడ్పీ పీఠం దిశగా కోటపాటి జనార్ధనరావు

Select Suryaa Now
జడ్పీ పీఠం దిశగా కోటపాటి జనార్ధనరావు

జడ్పీ పీఠం దిశగా కోటపాటి జనార్ధనరావు

 - సేవా ప్రస్థానానికి దక్కనున్న గుర్తింపు

- టీడీపీ అధిష్టానానికి విశ్వసనీయ నేతగా పార్టీ విజయాల్లో కీలక సమన్వయకర్తగా ప్రత్యేక గుర్తింపు
- పారిశ్రామికవేత్తగా అభివృద్ధి కార్యక్రమాలకు అండ విద్యారంగానికి విశేష సహకారం
-రాజకీయ, సామాజిక సేవలతో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు
పామూరు, మేజర్ న్యూస్ : 
తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా అధిష్టానానికి విశ్వసనీయ నేతగా గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటపాటి జనార్ధనరావు  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే ఆయన రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి క్షేత్రస్థాయిలో సమన్వయకర్తగా పనిచేసిన అనుభవంతో పాటు ప్రజా సేవా కార్యక్రమాలు ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు రాష్ట్ర మంత్రులతో కోటపాటి జనార్ధనరావుకు సత్సంబంధాలు ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధిష్టానం అప్పగించిన ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకుని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ విజయానికి కృషి చేశారు. గత సాధారణ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కలికిరి మురళీమోహన్ విజయానికి ఎన్నికల అబ్జర్వర్‌గా వ్యవహరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పార్టీ విజయానికి కృషి చేశారు. వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం కోసం, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ శ్రీకాంత్ గెలుపులోనూ తనవంతు పాత్ర పోషించారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి విజయానికి కూడా క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు. బొట్లగూడూరు గ్రామంలో ఆయన తల్లి సర్పంచిగా ఉన్న సమయంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు సేవలందించడంలో కోటపాటి జనార్ధనరావు కీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలోని విద్యారంగానికి పలు సాయ సహకారాలు అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహించారు. పేద విద్యార్థులకు రాత పుస్తకాలు, క్రీడా పరికరాలు అందించడంతో పాటు విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందించారు. పామూరు, పీసీ పల్లి మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సొంత నిధులతో వాటర్‌ ఫిల్టర్లు ఏర్పాటు చేసి శుద్ధజలాన్ని అందించారు. బొట్లగూడూరు పరిధిలో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు కానున్న మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి కోటపాటి జనార్ధనరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాజకీయాల్లో అనుభవం, పార్టీ అధిష్టానంతో సత్సంబంధాలు, ఎన్నికల నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం, ప్రజా సేవా కార్యక్రమాలతో క్షేత్రస్థాయిలో ఉన్న పరిచయాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తగా, టీడీపీ రాష్ట్ర నాయకుడిగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన జనార్ధనరావుకు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీలక బాధ్యత దక్కే అవకాశాలపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.