దరి చేరకుండా "నులి పురుగులను"నలిపెద్దాం. హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు.
ఎన్ ఎన్ డి ప్రోగ్రాం లో యంపి డి ఓ మధుసూదన్, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ పి.ఓబులేసు.
చాపాడు మేజర్ న్యూస్ : మండలంలోని నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం విజయవంతం అయినట్లు నక్కల దిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి. ఓబులేసు చాపాడు యంపి డి ఓ మధుసూదన్ తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఓబులేసు, యంపి డి ఓ మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా, సమర్థవంతంగా చిన్న గురువలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగినట్లు యంపి డి ఓ మధుసూదన్, డాక్టర్ ఓబులేసు తెలిపారు. ముఖ్యంగా నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని అన్ని గ్రామాలలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు మాధ్యమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలలో ప్రభుత్వ, మరియు ప్రవేట్ అనే తారతమ్యం లేకుండా ఒక సంవత్సరం నుండి, పంతొమ్మిది సంవత్సరాల లోపు, కౌమార దశలో విద్యార్థులకు, ప్రతి ఒక్కరికీ ఆల్బెండజోల్ మాత్రలను ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారని డాక్టర్ తెలియజేశారు. ఈ మాత్రలు పరాన్నజీవి పురుగులను తొలగించడానికి వాడే ఔషదం అని అన్నారు. పురుగుల నుండి రక్షణ ఇస్తుంది, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడుతుంది, మాత్ర నమిలి మింగాలని, తర్వాత మంచి నీళ్లు తాగాలన్నారు.
నులిపురుగుల వల్ల కలిగే సమస్యలు.
రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి తగ్గడం, నీరసం, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, చదువు మరియు ఆటల్లో ఏకాగ్రత తగ్గడం, పిల్లల ఎదుగుదల మందగించడం వయస్సు ప్రకారం మోతాదు తీసుకునే విధానం. యంపిడిఓ మధుసూదన్ మాట్లాడుతూ -మధ్యాహ్నంభోజనంచేసిన ఒక గంట తర్వాత ఈ కార్యక్రమం మొదలైంది.1–2 సంవత్సరాలు:½ మాత్ర – మాత్రను పొడి చేసి నీటిలో కలిపి తాగించాలి.2–3 సంవత్సరాలు: పూర్తి మాత్ర – మాత్రను పొడి చేసి నీటిలో కలిపి తాగించాలి.3–19 సంవత్సరాలు:1 పూర్తి మాత్ర – బాగా నమిలి, నీటితో మింగాలి. నులి పురుగుల నివారణకు పరిశుభ్రత పాటిద్దాం
మరుగుదొడ్డిని మాత్రమే ఉపయోగించండి. భోజనం ముందు మరియు మలవిసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోండి.బయట ఆడేటప్పుడు, టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు చెప్పులు ధరించండి.గోళ్లను క్రమం తప్పకుండా కత్తిరించి శుభ్రంగా ఉంచండి.సురక్షితమైన తాగునీటిని ఉపయోగించండి.ఆహారాన్ని మూతపెట్టి ఉంచండి.పండ్లు, కూరగాయలను బాగా కడిగి తినండి.వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
లక్ష్మీపేట సచివాలయం పరిధిలో కేతవరం గ్రామంలో డాక్టర్ పి. కావ్య మాధురి 1--19 సంవత్సరాల వయసులో ఉన్న బాల బాలికలకు ఆల్బెండజోల్ మాత్రలను మింగించినట్లు తెలిపారు.
నులిపురుగులకు దూరంగా ఆరోగ్యంగా ఎదుగుదాం! పిల్లల ఆరోగ్యం మనందరి బాధ్యత. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి యం.రాఘవయ్య,సూపర్ వైజర్స్ ప్రసాద్,భవానీ,పాఠశాలల ఉపాద్యాయులు, వసతి గృహ సంక్షేమ అధికారి నాగకుమార్, వారి సిబ్బంది,యం ఎల్ హెచ్ పి శివమ్మ ,ఎ ఎన్ యం చంద్రకళ,ఆశా కార్యకర్తలు,అంగన్వాడీ కార్యకర్త లు,104 సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.