టీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో అనంత చతుర్దశి వేడుకలు
శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో అనంత చతుర్దశి వ్రతం
మంత్రాలయం, సూర్య ప్రతినిధి
కర్నూలు జిల్లా మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధానంలో శుక్రవారం శ్రీమతం పీదాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు అనంత చతుర్దశి వేడుకలు ఘనంగా జరిపారు. ముందుగా శ్రీ మూలా రాములకు వేదమంత్రోచరణలతో వైభవంగా పూజలు చేపట్టారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి మహా మంగళహారతి అందించారు. అనంత చతుర్దశి సందర్భంగా చతుర్దశి పురస్కరించుకుని శ్రీమతంలో చతుర్దశి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు.