BREAKING
27వ తేదీ యధావిధిగా పని చేయనున్న ప్రభుత్వరంగా,గ్రామీణ బ్యాంకులు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి జిల్లా పరిషత్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ పాత్ర కీలకం ఆయుష్మాన్ భారత్ రాకముందు చికిత్స కోసం ఇళ్లు, స్థలాలు అమ్ముకునేవారు: కేంద్ర మంత్రి జేపీ నడ్డా మన ఊరు మనబడి కింద మంజూరైన పాఠశాలలకు పెయింట్స్ వేయండి తిరుమలలో అనంత పద్మనాభస్వామి వ్రతం సందర్భంగా చక్రస్నానం వరద నీటితో బుగ్గ వారి వీధి మునక ఘనంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి నిర్వహణ టీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో అనంత చతుర్దశి వేడుకలు దరి చేరకుండా "నులి పురుగులను"నలిపెద్దాం. హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు. ఉమ్మడి ప్రాధాన్యతలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం.. యూరోపియన్ యూనియన్ రాయబారి కీలక ప్రకటన పేద కుటుంబాలకు రేషన్ కార్డు భరోసా – ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. గాంధీ పార్క్, మున్సిపల్ క్యాంటీన్ యాక్షన్ మళ్ళీ వాయిదా పశ్చిమ బెంగాల్ యాంటీ-గుండా బిల్లును వెనక్కి పంపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కేంద్ర చట్టాలతో వైరుధ్యమే కారణం

ఏలూరు రూరల్ జిల్లా ఆర్యవైశ్యంగా అధ్యక్షులుగా శీమకుర్తి

Select Suryaa Now
ఏలూరు రూరల్ జిల్లా ఆర్యవైశ్యంగా అధ్యక్షులుగా శీమకుర్తి

నేడు ఏలూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా శీమకుర్తి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం

 జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్ :- ఏలూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘానికి నూతన అధ్యక్షులుగా శీమకుర్తి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా మాటూరి  విఎస్ఎస్ జీవి ప్రసాదు కోశాధికారిగా ఒత్తిమిల్లి వీవీఎస్ ప్రసాదులు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీనివాసరావు తో పాటు కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈనెల 26వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు జంగారెడ్డిగూడెంలోని ఆలపాటి గంగాభవాన్ని కల్యాణ మండపంలో ఘనంగా జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకు అనుబంధ సంస్థ అయిన ఏలూరు రూరల్ జిల్లాకు ప్రధమంగా జంగారెడ్డిగూడెం కు చెందిన ప్రముఖ వర్తకులు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ప్రమాణ స్వీకారం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరితో పాటు రాష్ట్ర ఆర్యవైశ్య ప్రముఖులు పలువుడు పాల్గొనున్నారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు యీల్లూరి లక్ష్మయ్య అధ్యక్షతన జరిగే సభలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్ (చింతలపూడి ), చెర్రీ బాలరాజు ( పోలవరం), కామినేని శ్రీనివాస్( కైకలూరు), మద్దిపాటి వెంకట్ రాజు  ( గోపాలపురం), శ్రీరామ తాతయ్య ( జగ్గయ్యపేట) లతోపాటు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవాధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ తదితర ప్రముఖులు ప్రత్యేక ఆత్మీయ అతిథులుగా, అతిథులుగా పాల్గొనున్నారు. గత ఐదు దశాబ్దాలలో ఎంత భారీ ఎత్తున రూరల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం జంగారెడ్డిగూడెంలో జరగడం ఇదే ప్రథమం. ఈ సంఘాలతో పాటు వాసవి సేవాదళ్, ఆర్యవైశ్య మహిళా విభాగం నూతన కార్యవర్గాలు కూడా ఈ సభలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

 ఫోటో. శీమకుర్తి శ్రీనివాసరావు, అధ్యక్షుడు, ఏది ఎవరో రూరల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం

 

 రిపోర్టర్ రమణారావు జంగారెడ్డిగూడెం