BREAKING
ఆదర్శభావాల కలిగిన వారు ఆర్యవైశ్యులు ఇన్-సర్వీస్ టెట్-2 ప్రతిభ చాటిన వి. భరత్ బాబు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించకపోవడంపై పలువురు అసంతృప్తి హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణ తీర్మలపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. తెలంగాణ భక్తిని, సంస్కృతిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు రేణూ దేశాయ్ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఘాటు స్పందన వెంకటరమణ హిల్స్ కాలనీలో పోటాపోటీగా గణపతి లడ్డూ వేలం పౌర్ణమి పురిష్కరించుకుని వాసవిఅమ్మ వారికి ప్రత్యేక పూజలు. డా. మన్మోహన్‌ సింగ్‌ సేవలు చిరస్మరణీయం దేశ ఆర్థిక ప్రగతికి ఆయన కృషి ఆదర్శనీయం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ రేపు బ్యాంకులు పనిచేస్తాయ్.. మారెమ్మ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.లక్ష విరాళం ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ వెనక్కి తగ్గదు రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఓటరు జాబితా సవరణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన గ్రామకంఠం భూములపై సీఆర్‌డీఏ క్లారిటీ భారీ డిమాండ్ కారణంగానే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌లో పోటీ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగ ఘన నివాళులు....

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రోల్ అబ్జర్వర్

Select Suryaa Now
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రోల్ అబ్జర్వర్

 

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

132-ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర రోల్ అబ్జర్వర్ చేతన్ టీఎస్, ఐఏఎస్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా పోలింగ్ స్టేషన్ నంబర్లు 283, 287లను సందర్శించి అక్కడి పరిస్థితులను, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితా నిర్వహణ, సంబంధిత రికార్డులు, పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, ఎన్నికల విధులకు సంబంధించిన ఏర్పాట్లను రోల్ అబ్జర్వర్ పరిశీలించారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రక్రియలో నిబంధనలను పాటిస్తూ ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించినట్లు తెలిసింది. పోలింగ్ కేంద్రాల స్థితిగతులను స్వయంగా పరిశీలించడం ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, ఓటర్ల జాబితా ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిశీలనలో సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.