ఆదర్శభావాల కలిగిన వారు ఆర్యవైశ్యులు
ఆదర్శ భావాలు కలిగిన ఆర్యవైశ్యులు
ఎమ్మెల్యే సొంగ రోషన్‌కుమార్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్
జంగారెడ్డిగూడెం,మేజర్ న్యూస్ :
ఆర్యవైశ్యుల్లో ఔన్నత్యం, ఆదర్శ భావాలు ఉన్నాయని, అందుకే వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్‌కుమార్ అన్నారు. శనివారం స్థానిక ఆలపాటి కళ్యాణ మండపంలో ఏలూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం రూరల్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలోని పలు కమిటీల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్యవైశ్యులంటే ఎంతో అభిమానం ఉందన్నారు.
మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మాజీ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ సేవలను కొనియాడారు.
రూరల్ కమిటీ అధ్యక్షుడిగా శీమకుర్తి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా మాటూరి ప్రసాద్, కోశాధికారిగా వత్తుమిల్లి ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. వాసవీ సేవాదళ్, మహిళా విభాగం నూతన కమిటీల ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు యిల్లూరి లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
కెవి రమణ రావు జంగారెడ్డిగూడెం