వెంకటరమణ హిల్స్ కాలనీలో పోటాపోటీగా గణపతి లడ్డూ వేలం
రూ.3.70 లక్షలకు లడ్డూను దక్కించుకున్న రంజిత్ కుమార్–స్వప్న దంపతులు
మేడిపల్లి ,మేజర్ న్యూస్( సెప్టెంబర్ 26):
మేడిపల్లి–పర్వతాపూర్ పరిధిలోని వెంకటరమణ హిల్స్ కాలనీలో గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా నిర్వహించిన గణపతి లడ్డూ వేలం పాట ఉత్కంఠభరితంగా సాగింది. భక్తులు పోటాపోటీగా వేలంలో పాల్గొనగా రంజిత్ కుమార్–స్వప్న దంపతులు రూ.3.70 లక్షలకు గణపతి లడ్డూను కైవసం చేసుకున్నారు.అదేవిధంగా స్వామివారి శేష వస్త్రాలను అలకంటి రమేష్ గౌడ్–శ్రీవాణి దంపతులు రూ.55 వేలకు దక్కించుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య లడ్డూ ప్రసాదాలు, శేష వస్త్రాలను విజేతలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు చిలుముల జగదీశ్వర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కె.వి. గౌడ్, కాలనీ వాసులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ నర్సయ్య గౌడ్.