BREAKING
ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఉత్తరాంధ్ర థియేటర్ల జాబితా విడుదల.. అక్టోబర్ 2న భారీ రిలీజ్! విక్రమ్ ప్రభు ‘సిటీ ఆఫ్ గోల్డ్’ ఫస్ట్ లుక్ మరియు మిస్టీరియస్ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్! ఎన్టీఆర్ భావజాల వ్యాప్తిలో అట్లూరి అశ్విన్ పాత్ర చిరస్మరణీయం: టీడీ జనార్దన్ ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రంలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి : హీరో ఫహాద్ ఫాజిల్ కొండగట్టులో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు ఎల్లంపేట్ మున్సిపాలిటీలో వైభవంగా బీజేపీ ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమం పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడతల వారీగా ప్రతి అర్హ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు గుండె ఆరోగ్యం ఫై అవగాహన అక్టోబర్ 9న గ్రాండ్‌గా ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’ వరల్డ్ వైడ్ రిలీజ్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు! గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం.. అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్! సికింద్రాబాద్ జీఎంఆర్ స్ప్రింగ్‌ఫీల్డ్స్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు.. రికార్డు స్థాయిలో రూ.1,62,111కు అమ్ముడైన లడ్డూ తాండూరులో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వైయస్సార్సీపి కార్యాలయంలో పదవుల పండుగ ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

తెలంగాణ భక్తిని, సంస్కృతిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు రేణూ దేశాయ్ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఘాటు స్పందన

Select Suryaa Now
తెలంగాణ భక్తిని, సంస్కృతిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు రేణూ దేశాయ్ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఘాటు స్పందన

-
తెలంగాణ భక్తిని, సంస్కృతిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు
రేణూ దేశాయ్ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఘాటు స్పందన

తెలంగాణ బ్యూరో ప్రతినిధిః గణేశ్ ఉత్సవాల సందర్భంగా నటి రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజల భక్తి, సంస్కృతి, జీవన విధానంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో భక్తి అయినా, భుక్తి అయినా ప్రజలు బహిరంగంగా, అందరినీ ప్రేమగా ఆదరిస్తూ జరుపుకుంటారని సుధాకర్ రెడ్డి అన్నారు. భక్తి అనేది కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో ఉంటుందని, తోటి మనుషులను ప్రేమగా, నిజాయితీగా, ఆప్యాయంగా చూసుకోవడమే తెలంగాణ సంస్కృతిలోని భక్తి భావన అని పేర్కొన్నారు. “మీకు నచ్చనిది ఇతరులకు నచ్చవచ్చు. తెలంగాణ సంస్కృతిని గౌరవించగలిగితే ఇక్కడ ఉండండి.. లేదంటే మీకు నచ్చిన చోట ఉండండి. మీ సర్టిఫికెట్ కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూడటం లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు సూటిగా, స్వేచ్ఛగా, ఆనందంగా జీవించే స్వభావం కలిగిన వారని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రజల సంస్కృతి, ఆచార వ్యవహారాలను ఇతరులు తక్కువ చేసి చూడకూడదని అన్నారు.
అలాగే సత్యయుగం గురించి రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. సత్యయుగంపై తనదైన వ్యాఖ్యానం చేస్తూ, పురాణాల్లో దేవతలు, రాజులు మధుపానీయాలు, నృత్యాలతో కూడిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. “తెలంగాణకు మీరు వచ్చారు.. తెలంగాణ మీ దగ్గరకు రాలేదు” అంటూ రేణూ దేశాయ్ వ్యాఖ్యలపై సుధాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జై తెలంగాణ అంటూ ముగించారు.