BREAKING
విక్రమ్ ప్రభు ‘సిటీ ఆఫ్ గోల్డ్’ ఫస్ట్ లుక్ మరియు మిస్టీరియస్ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్! ఎన్టీఆర్ భావజాల వ్యాప్తిలో అట్లూరి అశ్విన్ పాత్ర చిరస్మరణీయం: టీడీ జనార్దన్ ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రంలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి : హీరో ఫహాద్ ఫాజిల్ కొండగట్టులో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు ఎల్లంపేట్ మున్సిపాలిటీలో వైభవంగా బీజేపీ ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమం పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడతల వారీగా ప్రతి అర్హ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు గుండె ఆరోగ్యం ఫై అవగాహన అక్టోబర్ 9న గ్రాండ్‌గా ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’ వరల్డ్ వైడ్ రిలీజ్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు! గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం.. అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్! సికింద్రాబాద్ జీఎంఆర్ స్ప్రింగ్‌ఫీల్డ్స్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు.. రికార్డు స్థాయిలో రూ.1,62,111కు అమ్ముడైన లడ్డూ తాండూరులో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వైయస్సార్సీపి కార్యాలయంలో పదవుల పండుగ ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి ఆదర్శభావాల కలిగిన వారు ఆర్యవైశ్యులు

ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ వెనక్కి తగ్గదు రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఓటరు జాబితా సవరణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన

Select Suryaa Now
ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ వెనక్కి తగ్గదు రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఓటరు జాబితా సవరణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన

తెలంగాణ బ్యూరో ప్రతినిధిః ఓటరు జాబితా సవరణలో వెలుగుచూస్తున్న అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు అనుమానాలు కలిగే పరిస్థితి రావడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల సంఘం స్వతంత్రతే పునాది అని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడేందుకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి భారతీయుడి ఓటు హక్కును పరిరక్షించే వరకు కాంగ్రెస్ వెనక్కి తగ్గదన్నారు. ఎన్నికల సంఘం బీజేపీ కార్యాలయం కాదని, ఓటరు జాబితా కేంద్ర ప్రభుత్వ ఆస్తి కాదని వ్యాఖ్యానించారు. ఓటు అధికార పార్టీ సొత్తు కాదని, అది దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తొలగించారని ఉత్తమ్ ప్రశ్నించారు. ప్రధాని సూచించిన కేంద్ర మంత్రిని కమిటీలో చేర్చి బీజేపీ మెజారిటీని ఖాయం చేసుకున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ గతంలో లేవనెత్తిన సందేహాలే నేడు దేశ ప్రజల ప్రశ్నలుగా మారాయని అన్నారు. ఎన్నికల కమిషనర్లు సంధు, జోషి లేవనెత్తినట్లు చెబుతున్న 14 అభ్యంతరాలపై ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోవాలో 97 మంది అర్హులైన ఓటర్ల పేర్లు తుది జాబితాలో చేరకపోవడం ఆందోళనకరమన్నారు. చట్టబద్ధ అధికారి అర్హత నిర్ధారించినప్పటికీ సాఫ్ట్‌వేర్ కారణంగా ఓటు హక్కు అడ్డుకోవడంపై వివరణ ఇవ్వాలని కోరారు. 97 మంది కావచ్చు.. ఒక్కరు కావచ్చు.. సంఖ్య చిన్నదని హక్కు చిన్నది కాదు అని ఉత్తమ్ అన్నారు. ఒక్క అర్హుడి ఓటు హక్కును అడ్డుకున్నా అది ప్రజాస్వామ్యంపై దాడేనని పేర్కొన్నారు. మనిషి కోసం సాంకేతికత ఉండాలి కానీ, సాంకేతికత కోసం ఓటు హక్కును బలి ఇవ్వకూడదన్నారు.
30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 13 కోట్లకు పైగా పేర్ల తొలగింపుపై పారదర్శకత అవసరమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో 22.21 లక్షల మంది పేర్ల పునరుద్ధరణకు అప్పీలు రావడం చిన్న విషయం కాదన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక పేరు సరిచేస్తే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. ఓటింగ్‌కు ముందే న్యాయం జరగాలి అని స్పష్టం చేశారు. అన్ని నిర్ణయాలు ఏకగ్రీవం’ అనే ఒక్క మాటతో ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు మాయమైపోవని అన్నారు. వివాదాస్పద నిర్ణయాలను ఎవరు అనుమతించారో ఎన్నికల సంఘం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. గోవా ఘటనతో పాటు ఓటరు జాబితాల సాంకేతిక వ్యవస్థపై నిష్పాక్షిక విచారణ జరపాలని కోరారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎన్నికల ప్రక్రియను నమ్మాలని ప్రజలను ఆదేశించలేరన్నారు. ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నీ కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.