ప్రజల వద్దకే మెరుగైన వైద్య సేవలు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
అనంతపురం బ్యూరో
ప్రజల వద్దకే మెరుగైన వైద్య సేవలు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
ప్రజల వద్దకే మెరుగైన వైద్య సేవలను తీసుకెళ్లడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నిధులు రూ.75 లక్షలతో నిర్మించిన రోగుల సహాయకుల విశ్రాంతి భవనాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఖాళీ పోస్టుల భర్తీతో పాటు పెండింగ్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. క్యాన్సర్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవిని’ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య పరీక్షలు అందిస్తున్నామని, త్వరలో 933 ఆరోగ్య రథాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. అనంతపురం ఆసుపత్రిలో రోగుల సంఖ్యకు అనుగుణంగా బెడ్లను పెంచేందుకు కృషి చేస్తామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఓ.ఆనంద్, ఎమ్మెల్సీ దలవాయి రమాదేవి, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.