BREAKING
పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా –ప్రజా ప్రభుత్వానికి అభినందనలు:* న్యాయవాది అశ్వినికి గ్రామస్తుల ఘన సన్మానం శ్రీకాకుళం జిల్లాకు కనీసం రూ.100 కోట్ల నిధులు కూడా తీసుకురాలేనీ ప్రభుత్వం:మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అవినీతి లేని పాలన అందిస్తా.. అభివృద్ధికి అంకితమవుతా...! సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి..... మంత్రతంత్రాల పేరుతో రూ.లక్షల్లో టోకరా - అంతర్రాష్ట్ర ముఠాలో ఐదుగురి అరెస్టు షీలానగర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ అర్షియా భాను ప్రమాణ స్వీకారం నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు.... థాయ్‌లాండ్‌లో ప్రతిపక్ష ఎంపీకి భారీ ఊరట దక్షిణ కొరియా కేబినెట్‌లో కీలక మార్పులు ఉక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతంలో రష్యా భీకర దాడి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా వాసంశెట్టి వెంకటరమణారావు ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం

ఆర్యవైశ్యులు ఆదర్శ భావాలు కలవారు, ఎమ్మెల్యే సొంగ రోషన్‌కుమార్

Select Suryaa Now
ఆర్యవైశ్యులు ఆదర్శ భావాలు కలవారు,  ఎమ్మెల్యే సొంగ రోషన్‌కుమార్

ఆర్యవైశ్యులు ఆదర్శ భావాలు కలవారు,

ఎమ్మెల్యే సొంగ రోషన్‌కుమార్

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్

ఆర్యవైశ్యుల్లో ఔన్నత్యం, ఆదర్శ భావాలు ఉన్నాయని, అందుకే వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్‌కుమార్ అన్నారు. శనివారం స్థానిక ఆలపాటి కళ్యాణ మండపంలో ఏలూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం రూరల్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలోని పలు కమిటీల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్యవైశ్యులంటే ఎంతో అభిమానం ఉందన్నారు.మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.మాజీ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ సేవలను కొనియాడారు.రూరల్ కమిటీ అధ్యక్షుడిగా శీమకుర్తి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా మాటూరి ప్రసాద్, కోశాధికారిగా వత్తుమిల్లి ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు.వాసవీ సేవాదళ్, మహిళా విభాగం నూతన కమిటీల ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు యిల్లూరి లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 కె.వి.రమణ రావు జంగారెడ్డిగూడెం