మారెమ్మ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.లక్ష విరాళం
అనంతపురం బ్యూరో
మారెమ్మ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.లక్ష విరాళం
అనంతపురం జిల్లా కంబదూరు మండలం పాళ్లూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మారెమ్మ దేవి ఆలయానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రూ.1 లక్ష విరాళం అందజేశారు. ప్రజావేదికలో గ్రామస్తులకు ఈ విరాళాన్ని అందించారు.
ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు సహకరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.