పౌర్ణమి పురిష్కరించుకుని వాసవిఅమ్మ వారికి ప్రత్యేక పూజలు.
పౌర్ణమి పురిష్కరించుకుని వాసవిఅమ్మ వారికి ప్రత్యేక పూజలు.
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్ లోని వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో జ్యేష్టమాసం పౌర్ణమి పురస్కరించుకొని వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. విగ్నేశ్వర పూజ, అనంతరం అమ్మ వారి మూలవిరాట్ కు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు ఫలారసలతో పసుపు కుంకుమలతో విశేషముగా అభిషేకములు ఆలయ ప్రధాన పురోహితులు సత్యనారాయణ శర్మ, అర్చకత్వం లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ నున్న బాలా త్రిపుర సుందర్రావు దంపతులు, పూర్వాధ్యక్షులు పేరూరు కాశయ్య కుమారుడు రమేష్ పూర్వపు ఆలయ సెక్రెటరీ ఆలపాటి వెంకటేశ్వరరావు ఆలయ కార్యదర్శి ఆలపాటి సత్యనారాయణ అనేకమంది భక్తులుపాల్గొన్నారు. అనంతరం స్వామి వారి కి నీరాజన మంత్రపుష్పం మరియు విశేషంగా అలంకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సెక్రటరీ మాట్లాడుతూ పౌర్ణమి పురస్కరించుకుని ఈ రోజు తాడేపల్లిగూడెంలో ఉన్న వాసవి అమ్మవారికి విశేష అభిషేకం చేసి విశేష పూజలు అలంకరణ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనంతరం పూజ చేసుకున్న భక్తులందరికీ ప్రసాదాలు అందజేయడం జరిగినది.