BREAKING
ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఉత్తరాంధ్ర థియేటర్ల జాబితా విడుదల.. అక్టోబర్ 2న భారీ రిలీజ్! విక్రమ్ ప్రభు ‘సిటీ ఆఫ్ గోల్డ్’ ఫస్ట్ లుక్ మరియు మిస్టీరియస్ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్! ఎన్టీఆర్ భావజాల వ్యాప్తిలో అట్లూరి అశ్విన్ పాత్ర చిరస్మరణీయం: టీడీ జనార్దన్ ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రంలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి : హీరో ఫహాద్ ఫాజిల్ కొండగట్టులో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు ఎల్లంపేట్ మున్సిపాలిటీలో వైభవంగా బీజేపీ ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమం పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడతల వారీగా ప్రతి అర్హ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు గుండె ఆరోగ్యం ఫై అవగాహన అక్టోబర్ 9న గ్రాండ్‌గా ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’ వరల్డ్ వైడ్ రిలీజ్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు! గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం.. అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్! సికింద్రాబాద్ జీఎంఆర్ స్ప్రింగ్‌ఫీల్డ్స్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు.. రికార్డు స్థాయిలో రూ.1,62,111కు అమ్ముడైన లడ్డూ తాండూరులో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వైయస్సార్సీపి కార్యాలయంలో పదవుల పండుగ ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

తీర్మలపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు..

Select Suryaa Now
తీర్మలపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు..

రూ.2,11,116కు వినాయకుడి లడ్డూ వేలం

కుల్కచర్ల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 26):కుల్కచర్ల మండల పరిధిలోని తీర్మలపూర్ గ్రామంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదానికి వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో గ్రామ ఉపసర్పంచ్ శివయ్య రూ.2,11,116లకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. లడ్డూ వేలంలో విజేతగా నిలిచిన శివయ్యను గ్రామస్థులు, భక్తులు అభినందించారు. వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ... వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని వేలం పాటలో దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. శ్రీ వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఉండి అభివృద్ధికి సహకరించాలని కోరారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన నిర్వాహకులు, గ్రామస్థులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.రిపోర్టర్ వడ్ల వినోద్ కుమార్.